Breaking

Thursday, April 30, 2015

Baanaasurudu Daakiki Damayanthi, బాణాసురుడు, డాకిని, దమయంతి | Rayachoti360

Baanaasurudu Daakiki Damayanthi, బాణాసురుడు, డాకిని, దమయంతి | Rayachoti360

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు - Baanaasurudu Daakiki Damayanthi, బాణాసురుడు, డాకిని, దమయంతి | Rayachoti360

Baanaasurudu Daakiki Damayanthi, బాణాసురుడు, డాకిని, దమయంతి | Rayachoti360



BaaNaasuruDu : బాణాసురుడు -- 

వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.


వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు (Sanskrit: बाणासुर) ), బలి చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.

 
బాణాసురిడితో శ్రీకృష్ణుడి యుద్ధం
ఇప్పటి అస్సాంలోని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు.

బాణాసురుని వంశపరంపర
బ్రహ్మ కుమారుడు మరీచి
మరీచుని కుమారుడు కశ్యపుడు
కశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు
ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు
విరోచుని కుమారుడు బలి చక్రవర్తి
ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు
ఆ బాణాసురుని భార్య కండల.
ఉషా అనిరుద్ధుల ప్రణయం


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


బాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తరువులు గీసి చూపుతుంది. అందులోని ఒక చిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తరువు చూసి ఈ రాకుమారుడా ! ఇతను శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుని బృందావనం నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నవిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు. ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాటక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు.

శైవజ్వరం వైష్ణవ జ్వరం

శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదు వంశ సైన్యంతో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యాదవసైన్యం బాణాసురిడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమధ గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది. ఈ యుద్ధాన్ని యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషాదులు గగనతలం నుండి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయవ్యా స్త్రాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆంధ్రాస్త్రం సంధించాడు.శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారింది. అప్పుడు నారాయణుడు (శ్రీకృష్ణుడు) సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోయాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పుడు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వెంటనే బాణుడు పలాయనమంత్రం పఠిస్తాడు. పరమ శివుడు మూర్ఛ నించి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. నారాయణుడు వైష్ణ్వ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించడంతో ఉపశమనం పొందుతుంది. నారాయణుడు ప్రయోగించిన వైష్ణ్వ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉండటంతో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలో నాలిగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకలదేవతలతో శ్రీకృష్ణుడి వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను. బాణుడు శివభక్తులలో అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు.




Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

Daakini : డాకిని -- 

మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ .

కామిని: కామం ఎక్కువగా ఉన్న స్త్రీ. కామించదగిన స్త్రీ. శాకిని, డాకిని ఆడ పిశాచాలు. 


Damayanthi : దమయంతి - 

'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).భీమమహారాజు కుమార్తె ,నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు . 

 దమయంతీ స్వయంవరం మహాభారతం లోని ఒక సన్నివేశం.

నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు.

 మార్ద్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. నలుడు "అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. 

మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను. 

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నాభర్త, కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్ధించింది. 

నలుడు దమయంతితో "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేని వారు, వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. 

అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి "దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్ధించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. 

Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com


How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

Baanaasurudu Daakiki Damayanthi, బాణాసురుడు, డాకిని, దమయంతి | Rayachoti360



Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం