విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
విభూతి యోగము(10 వ అధ్యాయం)
కృష్ణుడు:
నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.
నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి.
సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు.
నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు.
నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.
అర్జునుడు:
నువ్వు శాశ్వతుడని, పరమాత్ముడనీ, ఆది అనీ ఋషులు, వ్యాసుడు అందరూ, నువ్వూ అంటున్నారు. నేనూ నమ్ముతున్నాను. నిన్ను నువ్వుతప్ప ఇతరులు తెలుసుకోలేరు. ఏఏ వస్తువులందు ఏ విధంగా నిన్ను ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలవో చెప్పు.వివరంగా చెప్పు.
కృష్ణుడు:
నా విభూతులు అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు.ఎందుకంటే అవి అనంతం.కొన్ని ముఖ్యమైనవి చెప్తాను విను.
అన్ని ప్రాణుల ఆత్మను, సృష్టిస్థితిలయాలు,ఆదిత్యులలో విష్ణువును, జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను, మరుత్తులలో మరీచి, చంద్రుడను, వేదాలలో సామవేదం,దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో మనసును, ప్రాణుల చైతన్యశక్తిని, రుద్రులలో శంకరుడు, యక్షరాక్షసులలో కుబేరుడను, వసువులలో పావకుడు, పర్వత శిఖరాలలో మేరువు, పురోహితులలో బృహస్పతి, సేనాధిపతులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రాన్ని, మహర్షులలో భృగువు,వ్యాకరణంలో ఒంకారం, యజ్ఞాలలో జపయజ్ఞం, స్థావరాలలో హిమాలయం, వృక్షాలలో రావి,దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిలుడు, గుఱ్ఱాలలో ఉచ్చైశ్శ్రవం, ఏనుగులలో ఐరావతం, మానవులలో మహారాజు, ఆయుధాలలో వజ్రాయుధం, గోవులలో కామధేనువు, ఉత్పత్తి కారకులలో మన్మథుడు, పాములలో వాసుకి నేనే.
విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
నాగులలో అనంతుడు, జలదేవతలలో వరుణుడు,పితృదేవతలలో ఆర్యముడు,శాసకులలో యముడు, రాక్షసులలో ప్రహ్లాదుడు, కాలం, మృగాలలో సింహం,పక్షులలో గరుత్మంతుడు, వేగము కల వాటిలో వాయువు, శస్త్రధారులలో శ్రీరాముడు, జలచరాలలో మొసలి, నదులలో గంగానది, సృష్టికి ఆదిమధ్యాంతాలు నేనే. వాదాలు కూడా నేనే.
అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వసమాసం, సర్వకర్మ ఫలప్రదాత, మ్రుత్యువూ, సృజనా, స్త్రీ శక్తులలో కీర్తీ, లక్ష్మిని, వాక్కును, స్మృతీ, మేధ, ధృతి, క్షమ నేనే.
సామములలో బృహత్సామం, ఛందస్సులలో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతమూ నేనే.
వంచనలలో జూదాన్ని,తేజోవంతులలో తేజం,విజయం,కృషి చేయువారి ప్రయత్నం,సాత్వికుల సత్వగుణం, యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడు, కవులలో శుక్రుడను నేనే.
దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం, జ్ఞానులలో జ్ఞానం నేనే.
సర్వభూతాలకు బీజకారణం నేనే.నేను కానిది ఏదీ లేదు.
నా విభూతులు అనంతం.కాబట్టి సంగ్రహంగా చెప్పాను.
ఐశ్వర్యంతోను,కాంతితోను,ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో.
ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకే ఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
10. విభూతి యోగము - దశమాధ్యాయము
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని.
వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.,
ఓ కౌంతేయా! నీళ్ళలో రసమును నేను. చంద్రసూర్యలలో కాంతినేను.వేదములలో ప్రణవమును నేను.ఆకాశమున శబ్దమును నేను.మానవూలలో పౌరుషము నేను. నేలలో తావి నేను. సూర్యునిలో తేజస్సును నేను. భూతములలో జీవమేనేను.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
తాపసులలో తపస్సును నేను.భూతములన్నింటికి బీజమును నేను.బుద్ధివంతులలో బుద్ధిని నేను.తేజస్సులలో తేజస్సును నేను.బలవంతులలో కామరాగములు లేని బలమేనేను.ధర్మవిరుద్ధము కాని కామమేనేను.సాత్త్విక రాజసిక తామస భావములన్నియు నావల్లనే కలిగెడివి.వాటిలో నేను లేను.కాని అవి నాయందు ఉన్నాయి.విభూతి శ్లోకములకు ముఖ్యార్ధము చెప్పుచో పరిణామవాదములోకి దిగును.
ఏలనగా భగవంతుడే రసము, కాంతి మొదలగు రుఊపములు తాల్చెనని చెప్పవలసి వచ్చును. దారమును పూసలును ఒకటి కావు.ఈవిషయానంతరమునందే విభూతిశ్లోకములున్నవి.పరమాత్మ వలననే సాక్షాత్తు భూతోత్పత్తి యగునని భ్రమను నివారించుటకు నాలగవ పాదమున వానిలో నేను లేనుగాని అవి నాలో ఉన్నవి అని ముగింపబడెను.క్రతువు, యజ్ఞము, స్వధ, ఔషధము, నేయి, నిప్పు, హోమము నేనే.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
నేనే జగతికి తండ్రిని, తల్లిని, తాతను తెలియదగినవాడను నేనే.పవిత్రమగు ఓంకారము ఋక్కుసామము యజస్సు, గతి, భర్త, ప్రభువు, సాక్షి, నివాసము, శరణము, నెచ్చెలి, ప్రభవము, ప్రళయము, ఆధారము, నిదానము నేనే.ఓ అర్జునా! నేనే వేడిమిని కలుగజేయునది.నేనే వర్షించు నది, నేనే నీరు లాగుకొనునది; అమృతము మృత్యువు, సత్తు అసత్తు నేనే.ప్రకృతియే కార్యము చేయును.
కాని ఆప్రకృతి ఆత్మాధీనము. కావున ప్రకృతి కార్యము ఆత్మ కారోపించబడెను.జగత్తుయందు యేది దొడ్దదో ఆయా వస్తువులనే ఈశ్వరరూపముగా చింతించమని ఉపదేశించెను.
భగవానుని దివ్యగుణ వైభవాల గురించి విన్ తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను.
అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్థించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
విభూతి యోగము(10 వ అధ్యాయం) Vibhuti Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
No comments:
Post a Comment