అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Akshara brahma yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము)
అర్జునుడు:
కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.
భగవానుడు:
నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.
మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.
కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.
వేదవేత్తలు, నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప్తాను. నవద్వారాలను బంధించి, ఇంద్రియనిగ్రహం కల్గి, మనోవృత్తులను నిరోధించి, ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ, నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు.
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Akshara brahma yogam telugu bhagavad gita
బ్రహ్మలోకము వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు.బ్రహ్మకు వేయివేయియుగాలు ఒక పగలు,వేయియుగాలు ఒక రాత్రి.అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రికాలంలో లయమవుతుంది.అలానే సకలజీవులు కూడా.ప్రకృతికి అతీతమైన,శాశ్వతమైన పరబ్రహ్మ మాత్రం నశించదు.అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు.
సమస్తప్రాణులు ఉన్న,జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.
అగ్ని,జ్యోతి,పగలు,శుక్లపక్షం,ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు.
పొగ,రాత్రి,కృష్ణపక్షం,దక్షిణాయనం లలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు.ఇవి తెలిసిన యోగి భ్రాంతి చెందడు.కాబట్టి యోగయుక్తుడవై ఉండు.
దీనిని గ్రహించిన జ్ఞాని వేద,యజ్ఞ,జపతపాదుల వలన కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
8.అక్షరపరబ్రహ్మ యోగము - అష్టమాధ్యాయము
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు.
ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు.
అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు.
బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Akshara brahma yogam Telugu Bhagavad Gita | Rayachoti360
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Akshara brahma yogam Telugu Bhagavad Gita | Rayachoti360
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) Akshara brahma yogam telugu bhagavad gita
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
No comments:
Post a Comment