Breaking

Wednesday, September 23, 2015

Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360

Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360


Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360


కోతి కథ :

ఒక ఊరిలో ఒక చెరువుండేదంట. చెరువు ప్రక్కన్నే ఒక చెట్టుండేదంట. ఆ చెట్టులో ఒక కోతి ఇల్లు కట్టుకొని ఉండేదంట. ఒక రోజు ఆ కోతికి పాయసం తాగాలనిపించింది. అక్కడ ఒక చోట బెల్లం ముద్దలు పడుతూ ఉండేవాళ్ళు. ఆ కోతి అక్కడికి పోయేసి, రెండు బెల్లం ముద్దలు ఎత్తుకునింది. ఒకటి ఎత్తుకుని, తినేసింది. ఇంకొకటి టెంకాయమానులో దాచి పెట్టేసింది. 


Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com




monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


అక్కడే ఒక అవ్వ సామాన్లు ఎక్కువగా పెట్టుకొని అమ్ముతూ ఉండేది. కోతి అక్కడికి పోయి ఒక గుండా (పెద్ద గిన్నె) ఎత్తుకొనింది. రాళ్ళు పేర్చి పొయ్యి పెట్టేసింది. 


దాని మీద గుండా పెట్టింది. తరువాత అక్కడే ఉన్న కట్టెలు పేర్చి పెట్టేసింది. అన్నీ బాగా సమకూర్చుకుంది. "పొయ్యి వెలిగించటానికి అగ్గిపెట్టె కావాలి కదా!" అనుకుంది. అప్పుడు ఒక తాత కోతి ఉండే చెట్టు కిందికి వచ్చి, బీడీ తాగుతూ అగ్గిపెట్టెను ప్రక్కనే పెట్టేశాడు. కోతి వచ్చి మెల్లిగా అగ్గిపెట్టె ఎత్తుకొని వెళ్ళింది.

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com



ఇక కోతి సంతోషంగా ఆ కట్టెలని ముట్టించింది. కుండలోకి నీళ్ళు పోసింది. 

తర్వాత బెల్లం ముద్ద వేసింది. పాయసం పొంగు వచ్చింది; కానీ దాన్ని కలబెట్టేదానికి గంటె మాత్రం లేదు. అందుకని కోతి తన తోకతోనే కలబెట్టింది. ఇంక ఆ కోతికి మంట ఎత్తింది. 

అది అరుస్తూ, పొర్లుతూ, దొర్లుతూ, దారెంబడి పోతావుంటే దానికి నక్కబావ అడ్డం వచ్చినాడు: 

"ఏం కోతిబావా! అలా ఏడుస్తా వున్నావు?" అంటుందంట నక్క. "నాకు పాయసం తాగాలనిపించింది; పాయసం కలబెట్టేదానికి గంటె లేదు, అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను. అబ్బా! మంట!" అంది కోతి. 

అప్పుడు నక్కబావ "సరే, మా ఇంటికి రా! మా భార్య దగ్గరికి వెళ్దాం. మా ఇంట్లో ఏవేవో ఐటాలు ఉన్నాయిలే" అన్నది. కోతికి చాలా సంతోషం వేసింది. 


ఆ సంతోషంలో‌ తోక మంటను కూడా మర్చిపోయింది. ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్ళారు. అప్పుడు నక్క బావ భార్యను పిలిచి-"కోతికి ఏమన్నా ఐటాలు పెట్టు" అన్నాడు. 

"నేను ఇంకా ఏమీ వంట చెయ్యలేదు, నువ్వు వెళ్ళి మునక్కాయలు కోసుకు రా, నీకు నచ్చేట్లు వంట చేసి పెడతాను " అన్నది నక్క భార్య కోతితో.


కోతి తొందర తొందరగా వెళ్ళి మున-క్కాయలు తెచ్చి ఇచ్చింది. నక్క భార్య వాటిని తీసుకొని లోపలికి వెళ్ళింది. 


నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు. ఇంక ఘుమ ఘుమ వాసనలు మొదలు అయినాయి. కోతికి నోట్లో నీళ్ళూరుతున్నాయి. కడుపులో‌ ఎలుకలు పరుగెత్తుతున్నాయి. నక్క భార్య ఇంకా పిలవలేదు భోజనానికి.

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



"నేను వెళ్ళి చూసి వస్తాను" అని చెప్పి, లోపలికి వెళ్ళాడు నక్కబావ. వెళ్ళిన వాడు ఇంక వెనక్కి రాలేదు. కోతికి మళ్ళీ మంటెత్తుకునింది. 


ఆగలేక, మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే- ఏముంది?! అక్కడ నక్కబావ, అతని భార్య- ఇద్దరూ బాగా తినేసి, గుర్రుపెట్టి నిద్రపోతున్నారు! 


మునక్కాయల పిప్పి కుప్పలు కుప్పలుగా పడిఉంది! గుండా అంతా ఖాళీ! "జిత్తులమారిదాన్ని నమ్మటం నాదే బుద్ధి తక్కువ" అనుకొని, కోతి ఆకలితోనే ఇంటి దారి పట్టింది.




How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. అది ఆ చెట్టుకి కాచే తియ్యటి పళ్ళని తింటూ జీవించేది.

ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది.

అలా కోతి నీళ్ళలోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది.

మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ‘ఓ కోతిబావా నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్ళలోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకు ఇవ్వగలవా’ అని బ్రతిమిలాడింది.
ఆ రోజునుండి కోతి, మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతికాలంలోనే మొసలి, కోతీ మంచి స్నేహితులయ్యాయి.

మొసలి ఇంటివద్ద భార్యా పిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడప సాగింది.

దాంతో మొసలి భార్య కి చాలా కోపం వచ్చింది.

‘ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడటమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు’ అనుకుంది.

ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది.

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


భార్య పడుకుని ఉండడం చూసి ‘ఏమైంది? ఎందుకలా ఉన్నావు?’ అని అడిగింది.

‘నాకు ఈ మధ్య విపరీతమైన తలనెప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనెప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?’ దిగులుగా అన్నది మొసలి భార్య.

‘ఓస్! ఇంతేనా? నువ్వేం దిగులుపడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనెప్పి తప్పక తగ్గుతుంది’ అని చెప్పింది మొసలి.

వెంటనే కోతి వద్దకు వెళ్ళి ‘మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకుని పొదామని వచ్చాను’ అంది.

‘కానీ, నేను నీళ్లల్లోకి ఎలా రాగలను?' సందేహం వెలిబుచ్చింది కోతి.

‘ఓహ్ అదా! నువ్వు నా వీపు పైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళతాను’

మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీదనుండి క్రిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది.

కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలు పెట్టింది. మొసలి కన్నీళ్ళు చూసిన కోతి కంగారుగా ‘అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది.

‘ఏం చెప్పమంటావు మిత్రమా!’ అంటూ భార్యకు తలనెప్పి రావడం.. వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం... అంతా వివరంగా కోతికి చెప్పి ‘నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను’ అంది మొసలి.

తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి.

అందుకే ‘అయ్యో! ఎంత పని జరిగింది మిత్రమా! ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా!’


Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com



‘ఏం ఇప్పుడేమైంది?’ ప్రశ్నించింది మొసలి.

‘నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండె లేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు’

‘అవునా? మరిప్పుడేం చేద్దాం?’

‘నన్నువెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనెప్పికి మందూ అమరుతుంది.’ అంది కోతి.

తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది.

అంతే కోతి చెంగున ఒడ్డు పైకి గెంతి గబ గబా చెట్టెక్కి కూర్చుంది.

కోతి ఎంతకూ రాక పోయేటప్పటికి మొసలి ‘మిత్రమా త్వరగా రా’ అని కేక పెట్టింది.

అప్పుడు కోతినవ్వి ‘ఓరీ ! మిత్ర ద్రోహీ, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్భుద్ది నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకూ నాకూ మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగి పో!’ అంది కోతి.

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


మొసలి తను చేసిన బుధ్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది.

నీతి: మోసకారులనుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి.



Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com




Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Monkey kothi Telugu lo stories kathalu | కోతి కథ | Rayachoti360

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education neethikathalu comedystories quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం