Raju stupid telugu lo stories kathalu
రాజు మూర్ఖత్వం
రాజు మూర్ఖత్వం
రాజు మూర్ఖత్వం :
________________
________________
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వెళ్లాడు. అడవిలో వెళ్తుండగా ఒక పులి అతని మీద పడి చంపాలని ప్రయత్నించింది. అటు నుండి వస్తున్న యువకుడొకడు దా
"రాజా! అడవిలోతిరగాలంటే మీకు కత్తిని వాడటం తెలిసి ఉండాలి. లేకపోతే ఇలాంటి క్రూరజంతువులనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కావాలంటే నేను మీకు ఆ విద్య నేర్పగలను" అన్నాడతను రాజుతో.
కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. 'ఒక సామాన్యుడినుండి ఏ విద్యనైనా నేర్చుకోవటం నాకు ఇష్టంలేదు' అన్నాడు.
ఆ మాటలకు నొచ్చుకున్న యువకుడు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయాడు.
ఆ తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. అక్కడ ఎదురైన సింహం అతని మీద పడి చంపింది. 'చురకత్తితో యుద్ధం చేయటం ఎలాగో నేర్చుకొని ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు గదా, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరించాలి' అనుకున్నాడు రాజు, చనిపోబోతూ.
No comments:
Post a Comment