Breaking

Tuesday, August 18, 2015

Bhakthi Telugu lo stories kathalu భక్తి | Rayachoti360

Bhakthi Telugu lo stories kathalu భక్తి | Rayachoti360


Bhakthi Telugu lo stories kathalu భక్తి | Rayachoti360


 
ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో `విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు?' అన్న ప్రశ్న తలెత్తింది. "గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు" అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరే అతను వినిఉండలేదు మరి! అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి, రంగప్పను గమనించటం మొదలుపెట్టాడు.

Bhakthi Telugu lo stories kathalu భక్తి | Rayachoti360


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.



ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

రంగప్పకు ఐదుగురు పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ. పిల్లల్ని పెంచటంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్నీ, వాళ్ళకున్న పది పశువుల బాధ్యతనీ చక్కగానే నిర్వర్తిస్తున్నది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్లి సాయంత్రం చీకటిపడే వేళకు తిరిగి వస్తున్నాడు. పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులూ, ఊళ్లో చేయాల్సిన పనులూ ఉంటున్నాయి. వీటన్నిటి మధ్యా అతను దేవుడిని రోజూ ఓ పదిహేను ఇరవై నిముషాల పాటు తలచుకుంటున్నాడు. రోజూ స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుని గూడు ముందు నిలబడి రాముడి పటానికీ, కృష్ణుడి పటానికీ పూజ చేస్తున్నాడు.

ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు. "అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉన్నది? దానికి అంత మెచ్చుకోలు దేనికి? రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు." నారదుడు వెనక్కు పోయి విష్ణువుకు అదే చెప్పాడు.

"అట్లాకాదు. రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు. పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లన్నిటినీ ఎలాగూ అతను భరిస్తున్నాడు. అయినా కూడా అతను తన పూజను ఏనాడూ మరువడు. 


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

పరిపూర్ణమైన భక్తితో, ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజూ పూజచేస్తాడు. అది కొంచెం సేపే అయితే మాత్రం ఏమిటి? అతనికంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్నివ్వరు ఆత్మశుద్ధికి" అన్నాడు విష్ణుమూర్తి.

అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు విష్ణువు "స్వయంగా అనుభవిస్తే తప్ప, ఇలాంటివన్నీ సరిగా అర్థం కావు. ఏదో ఒకనాడు నీకా అనుభూతి తప్పక కలుగుతుంది" అన్నాడు నవ్వుతూ.తర్వాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు. ఏమైందో ఏమో, అక్కడ ఆయనకు 



indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com




ఒక అందమైన యువతి కనబడింది. నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు. ఆపైన నారదుడి మామగారు అతనికి కొంత నేలనిచ్చారు. ఆ నేలను సాగుచేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు. 


మెల్లగా అతను వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆలోగా అతని భార్య ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ఇక నారదుడి పనిభారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి. వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. కాలం ఎటుపోతున్నదీ తెలియలేదు.



 ఒకరోజున నారదుడు, అతని భార్య సుధ, వాళ్ల ఇద్దరు కొడుకులు - అందరూ వేరే ఊరునుండి వెనక్కి తిరిగి వస్తున్నారు. దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది. 

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

వాళ్లు తడిసి తడిసి, ఊరి చివరనున్న వాగును చేరుకునే సరికి, మామూలుగా నీళ్లంటూ ఉండని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తున్నది! వాళ్లు నలుగురూ వాగు ఒడ్డున కొంతసేపు వేచిచూశారు, కానీ ప్రవాహం తగ్గేటట్లు లేదు. `ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో?' కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు. ఇద్దరు కొడుకుల్నీ భుజాలకెత్తుకున్నాడు. భార్య సుధను తన వెనుకనే నడవమన్నాడు. జాగ్రత్తగా వాగులోకి దిగి నడవటం మొదలెట్టాడు.

ఇంకా వాగు నడుమకు చేరుకున్నాడో లేదో, కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లై బోర్లా పడిపోయాడు నీళ్ళల్లో! పిల్లలిద్దరూ ఒక్క క్షణ కాలంలో కనుమరుగయ్యారు - నీళ్లలో పడి కొట్టుకుపోయారు. అదే సమయంలో పట్టుతప్పిన సుధ జారి నీళ్లలో పడింది. నారదుడు అరుస్తూ చేయి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది!! నారదుడొక్కడే అతి కష్టంమీద ఒడ్డు చేరుకోగలిగాడు. దు:ఖంతో, నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి. "అయ్యో! భగవంతుడా! ఏమిటీ విపరీతం!" అని బిగ్గరగా ఏడ్చాడు.

ఆ క్షణాన విష్ణువు ప్రత్యక్షమై, నారదుడిని తట్టి లేపాడు. మాయకు లోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడిందీ గుర్తొచ్చి ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు. ఆ వలయంలో చిక్కుకుని, తను ఒక్కసారికూడా భగవంతుడిని స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి! `రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు' అని అట్లా అనుభవ పూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయ రహితుడై, విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు! 



Bhakthi Telugu lo stories kathalu భక్తి | Rayachoti360



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


Once Narada and Vishnu were talking. At that time, the question arose, `Who is the most beloved devotee of Vishnu?'. ``Rangappa, a farmer living in the village of Gumalapuram, is the foremost of my devotees,'' said Vishnu. Narada looked at him suspiciously. He had never heard of Rangappa! So he immediately set out for Gumalapuram and started observing Rangappa.



Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Rangappa has five children. Rangappa's wife is Radhamma. Along with raising the children, she also takes care of the household and the ten cattle they have. Rangappa goes to the fields in the morning and returns in the evening when it gets dark. On days when he has no work to do in the fields, he has work to do at home and in the village. In between all this, he thinks of God for fifteen to twenty minutes every day. After taking a bath every day, he stands in front of the shrine of the deity in the house and worships the image of Rama and Krishna.

Observing all this, Narada could not understand what was special about Rangappa. "What is so great about the ordinary worship he performs? Why is it so praised? There is nothing special about Rangappa." Narada went back and told Vishnu the same.


"That is not true. Rangappa is busy all day long. Moreover, he is responsible for sailing the ship of life and enduring all the ups and downs of samsara. Still, he never forgets his worship. He worships every day with complete devotion and concentration. What if it is a little short? Even people who have less work than him do not give as much time to self-purification as he does," said Vishnu.

However, that answer did not satisfy Narada. Then Vishnu said, "Unless you experience it yourself, you will not understand all this properly. Someday you will definitely experience it." Then Narada set out on a journey. Somehow, he found a beautiful young woman there. 

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Narada married her and stayed there. Then Narada's father-in-law gave him some land. By cultivating that land, Narada became a good farmer. Slowly, he learned the joys and sorrows of farming. In the meantime, his wife gave birth to two sons. Narada's workload increased even more. In this process, his social responsibilities doubled. In addition to these, he was surrounded by health problems and financial problems. He did not know how time was passing.

Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


One day, Narada, his wife Sudha, and their two sons - all of them - were returning from another village. On the way, it suddenly started raining heavily.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

They were drenched and when they reached the stream at the end of the village, the stream, which was usually not still, was now flowing very violently! The four of them waited on the bank of the stream for some time, but the flow did not seem to decrease. `What is the situation at home?' After waiting for a few hours, Narada could not wait any longer. He lifted his two sons by the shoulders. He asked his wife Sudha to walk behind him. He carefully stepped into the stream and started walking.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com



Before he had even reached the middle of the stream, something wrapped around his legs and he fell headlong into the water! Both the children disappeared in a moment - they fell into the water and were swept away. At the same time, Sudha, who had lost her grip, slipped and fell into the water. 

While Narada was shouting and offering her hand, she was also swept away by the current!! Narada was the only one who could reach the bank with great difficulty. His heart was filled with sorrow and despair. "Oh! God! What a strange thing!" he cried out loudly.

At that moment, Vishnu appeared and woke up Narada. Narada suddenly felt ashamed, remembering how he had swum in the ocean of samsara under the illusion. Narada also remembered that he had never remembered God even once, trapped in that circle! Narada, having realized through experience that `Rangappa is truly a great devotee', without hesitation, prostrated himself before Vishnu! 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం