Breaking

Wednesday, August 12, 2015

One Two Telugu lo stories kathalu ఒకటి-రెండు | Rayachoti360

 One Two Telugu lo stories kathalu ఒకటి-రెండు | Rayachoti360


One Two Telugu lo stories kathalu ఒకటి-రెండు | Rayachoti360
ఒకటి-రెండు :-
 
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకొని, అందులో ఒక ముసలమ్మ జీవించేది. 

One Two Telugu lo stories kathalu ఒకటి-రెండు | Rayachoti360


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com



ముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి, ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగుపళ్లు, మేడిపండ్లు, బలిజ పండ్లు, నేరేడుపండ్లు వంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చేది. వాటిని ఊళ్లో అమ్మి, వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది. 

ఇలా ఉండగా, ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్లదయ్యాలకు కాళ్లూ చేతులు ఉలఉలా అన్నాయి. ముసలమ్మను ఆటపట్టించాలన్న ఆలోచన ఆ తుంటరి పిల్లదయ్యాలు రెండింటికీ ఒకేసారి కలిగింది. ఆ ఆలోచన రాగానే అవి రెండూ ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి, ఏదైనా చేద్దామనుకున్నాయి; కానీ కొంచెం ఆలోచించినమీదట, తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి. 

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


ఇక ముసలమ్మేమో పళ్ళన్నిటినీ బుట్టనిండా ఏరి, ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దెయ్యాలు రెండింటికీ ముసలమ్మ కొట్టం ఉన్న మర్రిచెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండూ మర్రి ఊడల్ని పట్టుకొని ఊగడం ప్రారంభించాయి. అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళి, పళ్ళన్నీ అమ్మి, చీకటిపడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండూ ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉన్నది. ఇక అవి రెండూ అవ్వకు కనిపించాలనుకుని, ఒక్కసారిగా కనిపించి ఇకిలించాయి. 

ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ ఖంగుతిన్నది. కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ- "ఎవరు మీరు? ఏం కావాలి మీకు?" అని ప్రశ్నలు వేసింది దర్జాగా."మేము దయ్యాలం. మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడివేడి రొట్టెలు కావాలి" అని దయ్యాలు రెండూ ఏకకంఠంగా అరిచాయి. 

ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలెమ్మని, ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ `దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా?' అని ఆలోచించేసుకుంది ముసలమ్మ.
ఆపైన పథకం ప్రకారం మూడు జొన్న రొట్టెలను చేసి, వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి.
"కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం" అన్నది మొదటి దయ్యం. 
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

`సరే'నన్నది రెండో దయ్యం.

మరి లెక్కపెడితే రొట్టెలేమో మూడున్నాయి! ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్కపెట్టిన మొదటి దయ్యం. దానికిగాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి, రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది: 
"ఒరేయ్! మనం ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె. గెలిచిన వాడికి రెండు రొట్టెలు" అన్నది. 
 
"సరే" అన్నది రెండవ దెయ్యం. 

ఇక అవి రెండూ ఒకదాని కళ్లల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంత సేపటికీ పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళ రెప్పలు ఆర్పలేవాయె!

ఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో నాలుగు ఇనుప చువ్వలను పెట్టి ఎర్రగా కాల్చి, ఆ రెండింటినీ తీసుకొని, మెల్లగా వెళ్ళి, ఒక దయ్యానికి వెనక అంటించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పోయినంత పనైంది. అది ఎగ్గిరి దూకి, బోర్లా పడి, మొత్తుకోసాగింది.
తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దెయ్యం అవ్వను, అవ్వ చేతిలోకి చేరుకున్న మరో రెండు చువ్వల్నీ గమనించలేదు. అది గంతులేసుకుంటూ "నాకు రెండు! నాకు రెండు! అని బిగ్గరగా అరిచింది. 

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


'రెండేం ఖర్మ! నాలుగిస్తా'నని అవ్వ దానికీ రెండు అంటించింది. ఆ వాతల దెబ్బకు దెయ్యాలు రెండూ ఒక్కసారిగా అక్కడి నుండి అదృశ్యమయ్యాయి.

మూడు రొట్టెల్నీ మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని, హాయిగా నిద్రపోయింది! 

One Two Telugu lo stories kathalu ఒకటి-రెండు | Rayachoti360




One-Two :-

That is, a village. At the end of that village was a big banyan tree. Under that tree, a small hut was built, and an old woman lived in it.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

The old woman was very brave. There was a big forest near the hut. Even so, she was not afraid at all. Moreover, that old woman alone would go to the forest every day and bring back baskets full of various fruits such as plums, medi fruits, balija fruits, and neredu fruits that were available in the forest at that time. She would sell them in the village and live comfortably with the money she earned.


Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com



Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

Meanwhile, one day, the old woman, who went to the forest for fruits, caught the eye of two little ghosts living in that forest. When they saw the old woman, the little ghosts' legs and hands trembled. The thought of teasing the old woman occurred to both of the naughty little ghosts at once. When that thought came to them, they both went close to the old woman and wanted to do something; but after thinking for a while, they decided that it would be better to stop and follow the old woman and make her cry.

The old woman picked up all the apples in a basket, carried the basket on her head, and walked straight home. Both the ghosts were very happy when they saw the banyan tree where the old woman had her hut. They both started swinging the banyan branches. In the meantime, the old woman left for the village, sold all the apples, and returned home at dusk. By then, both the little ghosts were very tired and exhausted. Moreover, they were hungry. Now they both wanted to appear to the old woman, and suddenly appeared and sneered.

The old woman was shocked to see the two ghosts who had seemingly disappeared. But pretending to be solemn, she asked questions in a dignified manner. "We are ghosts. We want freshly baked bread," both ghosts shouted in unison.

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


The old woman did not know what to do. However, hoping to find time to think, she calmly set about making bread. While making bread, the old woman thought, "How can we please the ghosts?".

Then, according to the plan, she made three sorghum breads, put them in a single bowl and placed them in front of the ghosts. Seeing them, both ghosts jumped up and down happily.

"Let's share the bread in the bowl and eat it," said the first ghost.

``Okay,'' said the second ghost.

And if you count, there are three loaves! Anyway, the first ghost counted the ones he wanted to eat the most. So he thought of a trick and made a little bet with the second ghost:
"Hey! Let's look into each other's eyes. Whoever closes their eyes first gets one loaf of bread. The winner gets two loaves of bread."

"Okay," said the second ghost.

And they both sat looking into each other's eyes. The bet continued for a long time. They were ghosts, they couldn't close their eyes!

And the old woman, who thought of that, put four iron rods in the stove and heated them until they were red hot, took both of them, and slowly went and touched them to the back of one of the ghosts. The heat was so intense that the ghost lost not only his eyes, but his life. It jumped up, fell down, and started to bite.
The second ghost, who was so happy that he had won, did not notice the other two sticks that the grandmother had reached. It jumped up and shouted loudly, "Two for me! Two for me!"

"Two for me! I'll make four," the grandmother said, and the ghosts immediately disappeared from the scene.

The grandmother, who had the three leftover loaves, ate them and fell asleep peacefully!
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం




Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం