Internet TV phone for rs. 150 rupees only | Rayachoti360

Internet TV phone for rs. 150 rupees only | Rayachoti360


 ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ రూ.150కే !! = internet TV phone for rs. 150 rupees only

రాష్ట్రసర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు గురువారం విశాఖలో ప్రారంభించనున్నారు. సాంకేతిక విప్లవం ద్వారా సాధించిన ఫలితాలను సామాన్యులకు కారుచౌకగా అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీంట్లో భాగంగా.. కేవలం రూ.150 రుసుముతో ప్రతి ఇంటికీ 10-15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ సౌకర్యాలు కల్పిస్తారు. 

ఇందుకోసం రాష్ట్రంలో 22,500 కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ తొమ్మిది వేల కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేసింది. ఈ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలో 1.3 కోట్లకు పైగా గృహాలు, వ్యాపార సంస్థలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారు. 


60 వేల పాఠశాలలు, కళాశాలలకు ఇ-లెర్నింగ్‌... 6,580 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలీ మెడిసిన సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటిని తొలుత విశాఖలో ప్రారంభించి ప్రాథమిక దశలో ఉత్తరాంధ్ర అంతా విస్తరిస్తారు. క్రమంగా రాష్ట్రమంతటికీ అందిస్తారు.

Internet TV phone for rs. 150 rupees only | Rayachoti360
ఏప్రిల్‌ నెలాఖరుకు లేదా మే మొదటివారంలో విశాఖలో ఫైబర్‌ గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు తొలిదశలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. 


క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ సేవలు అందించేందుకు వీలుగా.. విద్యుత స్తంభాల ద్వారా కేబుళ్లను వేసి భారీమొత్తాన్ని ఆదా చేశారు. కాగా.. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రముఖ ఐటీ కంపెనీ సిస్కో సాంకేతిక సహకారం అందిస్తుండగా క్షేత్రస్థాయిలో కార్యకలాపాల బాధ్యతను టెర్రా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తీసుకుంది. 


ఈ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభ కార్యక్రమం గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరగనుంది. సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారు.



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


Internet TV phone for rs. 150 rupees only | Rayachoti360


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

Post a Comment

0 Comments