Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
ఒక నది ఒడ్డున ఒక ఎలుక, ఒక చీమ, ఒక కప్ప, ఒక ఈగ నివసిస్తూండేవి. ఆ నది ఒడ్డున కొబ్బరి చెట్లు, తాటి చెట్లు చాలా ఉండేవి. అక్కడే ఒక పెద్ద బండ ఉండేది. దాని పేరు 'కొబ్బరి బండ'. కొబ్బరి బండ మీద కప్ప, ఈగ, ఎలుక, చీమలకు కావలసినంత తాటి కొబ్బరీ, టెంకాయ కొబ్బరీ దొరికేవి.అయితే, వీటిలో చీమ, ఎలుకలు - కప్ప, ఈగలతో కలిసేవి కావు. కప్ప-ఈగ రెండూ మొద్దువనీ, తెలివి తక్కువవనీ చీమ-ఎలుక అనుకునేవి. వాటిని వెక్కిరించేవి. వాటిని తమనుంచి దూరంగా ఉంచేవి. కానీ కప్ప-ఈగ మాత్రం వాటినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నించేవి.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
కప్ప-ఈగ ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, ఆహార సంపాదన కోసం తొందరగా బయలుదేరి, నడుచుకుంటూ కొబ్బరి బండకు బయలుదేరేవి. కానీ ఎలుక-చీమ మాత్రం ఆలస్యంగా నిద్ర లేచేవి. అయితే, అవి తాటికాయ చిప్పలతో ఒక బండిని చేసుకొని పెట్టుకున్నాయి! దానిలో ఎక్కి కూర్చొని, అవి కప్ప-ఈగల కంటే ముందుగా కొబ్బరి బండ మీదికి చేరుకునేవి. అంతేకాదు; అక్కడ అవి తమకు నిజంగా కావల్సిన ఆహారంకంటే ఎక్కువ ఆహారాన్ని బండిలో వేసుకొని తీసుకు పోయేవి. పాపం! వెనకగా పోయిన కప్ప, ఈగలకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప-ఈగ చాలా కష్టాలుపడేవి.
ఇలా ఉండగా, ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చి పడింది. ఆ గాలివానకు అక్కడి నది పొంగింది; నేలంతా చిత్తడి చిత్తడిగా, బురదమయం అయిపోయింది. ఎక్కడచూసినా నీళ్లు, బురద! అలాంటి కష్ట సమయంలోకూడా కప్పకేమీ ఇబ్బంది లేకపోయింది! -ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా! అది నీళ్లలో చక్కగా అటూ ఇటూ ఈదులాడుతూ, దొరికినదాన్ని తిన్నది. ఇక ఈగేమో, ఎగురుకుంటూ పోయి, ఒక చెట్టు తొర్రలోదూరి వానకు చిక్కకుండా, వెచ్చగా కూర్చున్నది.
చీమ-ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పుట్టలోకి నీళ్ళు వచ్చాయి.ఎలుక కన్నం అయితే నదిలో మునిగిపోయింది. అయినా చీమ-ఎలుక కూడా ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
వర్షం ఆగిపోయాక, కప్ప-ఈగ రెండూ, ఆహారం కోసం కొబ్బరి బండ మీదికి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లగల్గాయి. కానీ ఎలుక-చీమ మాత్రం ఆ నీళ్లల్లోంచి బండ మీదికి ఎక్కలేకపోయాయి.
అయితే కొంతకాలానికి వాటికొక ఉపాయం తోచింది. ఒక పెద్ద కొబ్బరి చిప్పను తీసుకొని, అవి రెండూ అందులో కూర్చొని, ఒక టెంకాయ పుల్లని తెడ్డుగా చేసుకొని, పడవలో మాదిరి, నిదానంగా అవి కొబ్బరిబండ మీదికి ఎక్కగల్గాయి!
కానీ అప్పటికే చాలా ఆలస్యమయిందన్న విషయం ఆ రెండింటినీ నిలువనియ్యలేదు. అవి అనుకున్నాయి "బండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప-ఈగ మన వంతు ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసి ఉంటాయ"ని.
కానీ, నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప-ఈగ తమకు కావలసినంత మాత్రమే తీసుకుని, వెనకగా వచ్చే వారి కోసం కూడా అహారాన్ని మిగిల్చాయి.
తమకు ఇక ఆహారం దొరకదనీ, తాము ఆకలితో మాడిచావటం ఖాయమనీ అనుకుంటూ, నిరాశతో మెల్లగా బండమీదకు పోయిన చీమ-ఎలుకలకు, అక్కడ చాలినంత ఆహారం కనబడ్డది!
ఆబరాగా కడుపులు నింపుకొని అటూ ఇటూ చూస్తే, ఆ బండమీదే ఓ పక్కన కూర్చొని, తమకు కావలిసినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుని తింటున్న కప్ప-ఈగ కనిపించాయి వాటికి. ఆ క్షణంలో వాటికి కప్ప-ఈగల ఉన్నతత్వం అర్ధమైంది. తాము గతంలో చేసినట్లు, అవి దొరికినదంతా తినేసి ఉంటే ఈనాడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసివచ్చింది. మనసు లోతుల్లోనుంచి పశ్చాత్తాపం జనించింది.
అవి వెళ్లి కప్ప-ఈగలను క్షమాపణ కోరాయి. ఆపైన అన్నీ కొబ్బరి బండమీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ, అరమరికలు లేకుండా సంతోషంగా జీవించాయి.
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
A rat, an ant, a frog, and a fly lived on the bank of a river. There were many coconut trees and palm trees on the bank of that river. There was a big rock there. It was called 'Coconut Rock'. On the coconut rock, the frog, the fly, the rat, and the ants could find enough coconuts and coconuts. However, the ants, rats, and frogs did not get along with the flies. The ants and rats thought that the frog and the fly were stupid and unintelligent. They would make fun of them. They would keep them away from them. But the frog and the fly would try to get along with them.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
The frog and the fly woke up early every morning and set out early to find food. But the mouse and the ant woke up late. However, they made a cart out of palm fronds! They would climb into it and reach the coconut tree before the frogs and the flies. Moreover, they would take more food than they really needed with them. Too bad! The frog and the flies, who were left behind, could not find anything. The frogs and the flies suffered a lot because they could not find enough food.
Meanwhile, a big storm came and fell. The storm caused the river there to overflow; the whole land became a swamp and mud. There was water and mud everywhere! Even in such difficult times, the frogs had no problems! - Because the frogs are amphibians! It swam around in the water and ate what it found. The fly, meanwhile, flew away and sat in a tree trunk, sheltering from the rain.
The ant and the mouse struggled a lot. Water entered the anthill. The mouse, though small, drowned in the river. However, the ant and the mouse also hid somewhere and protected themselves.
When the rain stopped, both the frog and the fly were able to quickly go to the coconut rock for food without any difficulty. But the mouse and the ant were unable to climb up the rock from the water.
However, after a while, they came up with a trick. They took a large coconut shell, sat in it, and used a coconut shell as a paddle, like a boat, and slowly climbed up the coconut rock!
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
But the fact that it was already too late did not stop the two of them. They thought, "The frog and fly that went to the rock first must have emptied our share of food as well."
But in fact, the frog and fly, who knew the pain of hunger, took only what they needed and left some food for those who came after them.
Thinking that they would not find any more food and that they would surely die of hunger, the ants and mice, who slowly went to the rock in despair, found enough food there!
As they filled their stomachs and looked around, they saw a frog and a fly sitting on the rock to the side, taking only the food they needed and eating it. At that moment, they understood the superiority of the frog and the fly. They realized what would have happened to them today if they had eaten everything they found, as they had done in the past. Regret arose from the depths of their hearts.
They went and apologized to the frogs and flies. Then they all lived happily together, eating the food they found on the coconut tree.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
Kobbari bonda Telugu lo stories kathalu కొబ్బరి బండ | Rayachoti360
No comments:
Post a Comment