సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి లోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను
మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది.
Telugu lo kathalu stories heart touching story | Rayachoti360
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
అతడు మిగిలిన పిల్లల్లా
ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం
లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం
కలగలేదు .
కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా
పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక
పోవడమూ గమనించింది . పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు
రాయాలి . అందరి రికార్డులూ రాసేసినా ఎందుకో ఆమెకు మహేశ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి.
మహేశ్ వివరాలు నమోదుచేయాలి.
ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.
అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు .
అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు .
బ్రిలియంట్ బాయ్ "
రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్
కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది
పడుతున్నట్టున్నాడు "
మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ
అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు "
సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .
చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇస్తున్నారు .
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేశ్. ఆ బ్యాగ్ సగం చిరిగి ఉంది .
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి
" చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .
ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది .
క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .
ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .
ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు .
మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది.
అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం
సారాంశం .
సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను .
ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు
సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను .
సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .
ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు .
అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించింది..
"కన్ను తెరిస్తే జననం...కన్నుమూస్తే మరణం... రెప్పపాటు జీవితం”. ఒక మహాకవి రాతల్లో జనించిన జీవిత సత్యమిది.
జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్ళకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే...కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులెన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.
నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్‌లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.
మీరు మాత్రం కష్టాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ముప్పులున్నా వీటన్నిటినీ ఒక పక్కనపెట్టి మరో పక్క నా పుస్తకాన్ని పెట్టుకోండి. మీ బాధలన్నీ మర్చిపోతారు. పుస్తకం చదివి హాయిగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వుతారు... పగలబడి నవ్వుతారు... విరగబడి నవ్వుతారు... నవ్వుతూనే ఉంటారు. మీరలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటూ....
- గుత్తుల శ్రీనివాసరావు
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
No comments:
Post a Comment