Breaking

Monday, September 21, 2015

Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360

Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360


Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360

రుబ్బు రాయి
 
 
ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా స్ఫూర్తి లభిస్తుంటుంది. మరి ఈ పండిత పుత్రునిలో మార్పు ఎలా వచ్చిందో చూడండి:


Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

 
ఒక ఊరిలో గొప్ప పండితుడు ఒకాయన ఉండేవాడు. వాళ్ళ ఊరిలోనే ఒక విద్యాలయం స్థాపించి, ఆయన అనేకమందికి చదువు చెప్పేవాడు. ఆయన విద్యార్థులు దేశం నలుమూలలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు.

అయితే ఆయన కొడుకు రవిశంకరుడు మాత్రం ఎందుకూ పనికిరాని చవటగా తయారయ్యాడు. చదువు సంధ్యలు లేక, రవి ఊరంతా బలాదూరుగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునేవాడు. తండ్రి ఎంత తిట్టినా, కొట్టినా అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదు. అస్సలు చదవని కారణంగా అతను పదవతరగతి పరీక్షల్లో తప్పాడు కూడా.

కొడుకు 'పరీక్షల్లో తప్పాడే' అన్న బాధకొద్దీ పండితుడు రవిని ఏదేదో అనేవాడు. వాడికి మొదట్లో ఆ మాటలు బాధ కలిగించేవిగానీ, రానురానూ వాడు వాటిని పట్టించుకోకుండా వదిలెయ్యటం‌ నేర్చుకున్నాడు. ఆ తరువాత తిట్టీ తిట్టీ తండ్రి సిగ్గుపడేవాడు తప్ప, రవిశంకరుడికి మాత్రం ఏదీ‌ తగలకుండా అయ్యింది.

అలాగని రవిశంకరుడు నిజంగా బండరాయి కాదు. వాడికి ఏ పనినైనా మళ్ళీ మళ్ళీ చేయటం ఇష్టం లేదు- అంతే. ఒకసారి చదివిన పాఠాన్ని వాడు మళ్ళీ చదివేవాడు కాడు. ఒకసారి రాసినదాన్ని మళ్ళీ రాయాలంటే వాడికి మహా బద్ధకంగా ఉండేది- అలాగని వాడు ఏకసంథాగ్రాహీ కాదు! అందుకని వాడికి ఏదీ రాకుండా అయ్యింది.

వీటన్నింటికీ తోడు తండ్రి ఎత్తిపొడుపు మాటలు వాడికి చాలా కష్టం కలిగించేవి. ప్రేమగా ఎవరైనా చెబితే వాడికి ఈ సంగతులన్నీ అర్థం అయ్యేవేమో, కానీ అలా చెప్పేవాళ్ళు ఎవరూ వాడికి ఎదురు పడలేదు.

ఒక రోజున పండితుడు వాడితో విసిగిపోయి చెడామడా తిట్టేశాడు. దాంతో వాడికి విపరీతమైన కోపం వచ్చి, దొరికిన దారిన నడుస్తూ పోయాడు. ఊరి చివరన ఒక గుడిసె కనిపించింది వాడికి.

ఆ గుడిసె ముందు ఒక కుటుంబంలోనివాళ్లు అందరూ కూర్చొని రాతితో‌ రోళ్ళు-రోకళ్ళు, తిరగలిరాళ్లు, రుబ్బుడు గుండ్లు తయారు చేస్తున్నారు. ఆ శబ్దాలూ, వాళ్ళ పని తీరూ నచ్చి, వాడు అక్కడే కూర్చొని చూడసాగాడు.



ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

"ఒరే, మెల్లగా, కొంచెం కొంచెంగా చెక్కాలి. గరుకుగా ఉందని ఇంకా ఇంకా చెక్కుతూ పోయేవు- జాగ్రత్త. రుబ్బగా రుబ్బగా- నున్నగా అవుతుంది తప్ప, రుబ్బుడు గుండును ఎంత చెక్కినా నున్నగా కాదు" అంటున్నాడు, అక్కడ ఒక తండ్రి- కొడుక్కు రాళ్లు చెక్కటం నేర్పిస్తూ.

ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో‌చూశాడు రవి. ఒక రుబ్బుడు గుండును మళ్ళీ మళ్ళీ ఉలితో చెక్కుతున్నాడు వాడు. 'టిక్కు టిక్కు టిక్కు' అని ఉలి చప్పుడు చేస్తుంటే రవి ఆలోచనలు ఎటో పరుగెత్తాయి-
"బండరాయి అనుకునే రుబ్బుడు గుండు కూడా రుబ్బీ రుబ్బీ అరిగి- నునుపుగా తయారౌతున్నది. అలాంటి రుబ్బుడు రాయిని చేసేందుకుగూడా కార్మికుడు మళ్ళీ మళ్ళీ- ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఉలితో పనిచేస్తాడు. మళ్ళీ మళ్ళీ పనిచేస్తే బండలే అరుగుతున్నాయి- అలాంటప్పుడు, నేను మాత్రం పాఠాల్ని మళ్లీ మళ్లీ ఎందుకు చదవకూడదు?" అనిపించింది రవికి.

ఆ తరువాత రవి బాగా సాధన చేశాడు. పట్టుదలతో చదివాడు; మళ్లీ మళ్ళీ రాసాడు. తండ్రికంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అనేకమందికి తనే మార్గదర్శకుడైనాడు. సాధన చేస్తే సాధించలేనిది ఏముంది?
 



Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360


Rubbu stone

Everyone gets inspiration in a different way. And see how this scholar's son changed:

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

There was a great scholar in a village. He established a school in his village and taught many people. His students were in great jobs all over the country.

However, his son Ravi Shankar somehow became a useless fool. Without studying, Ravi used to wander around the village and waste time. No matter how much his father scolded and beat him, there was no change in him. He even failed in his tenth standard exams because he did not study at all.

Whenever the scholar was worried that his son would 'fail in exams', he would say something to Ravi. Although those words hurt him at first, he gradually learned to ignore them. After that, except for the titti titti father who was ashamed, nothing bothered Ravi Shankar.


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


But Ravi Shankar was not really a rock. He did not like to do anything over and over again - that was all. He did not reread a lesson he had read once. He was very lazy to rewrite what he had written once - and he was not a monotonous person! That is why he could not remember anything.

In addition to all this, his father's harsh words were very difficult for him. If someone had said these things to him in a loving way, he would have understood all these things, but he did not encounter anyone who said such things.

One day, the scholar got fed up with him and scolded him. At that, he got extremely angry and walked along the path he found. At the end of the village, he saw a hut.

In front of the hut, a family was sitting and making stone rollers, grinding stones, and grinding stones. He liked the sound and the work they were doing, so he sat there and watched.

"Hey, you have to carve slowly, little by little. Even if it's rough, you'll keep carving - be careful. Grinding, grinding, grinding - it will become smooth, but no matter how much you carve a grinding stone, it won't be smooth," said a father-son teacher teaching his son how to carve stones.


Ravi saw what the boy was doing. He was carving a grinding stone again and again with a chisel. As the chisel kept making the sound of 'tick tick tick tick', Ravi's thoughts raced -
"Even the stone, which is considered a stone, is being polished and polished - becoming smooth. To make such a stone, the worker works with the chisel again and again - very diligently and patiently. If he works again and again, the stone itself becomes brittle - in that case, why shouldn't I study the lessons again and again?" Ravi thought.

After that, Ravi practiced hard. He studied diligently; he wrote again and again. He earned a greater name than his father. He himself became a guide for many. What is there that cannot be achieved with practice? 
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360


Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com



indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


Rubbu rayi Telugu lo stories kathalu రుబ్బు రాయి | Rayachoti360


Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం