Rayachoty District - MLA Srikanth Reddy - New District Rayachoti

*రాయచోటిని జిల్లా చేయడం కోసం ఎమ్మెల్యే &ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, గారి కృషి అమోఘం,అభినందనీయం*
*73 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి*
*రాయచోటి న్యూస్*

అనాదిగా ఎంతో వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి జిల్లా కేంద్రం చేయడం కోసం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కృషి అమోఘం,అభినందనీయమని తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి కొనియాడారు.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు.అనంతరం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల అందించిన స్వాతంత్ర్య ఫలాల ఫలితంగానే నేడు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని తెలియజేశారు. అలాగే రాయచోటిని జిల్లాగా చేయడమే ద్యేయంగా,సర్వశక్తుల ఒడ్డిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి రెవెన్యూ,పట్టణ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.రాయచోటి జిల్లా కేంద్రం కావడం ఈ ప్రాంతవాసులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.


భవిష్యత్తులో రాయచోటి పట్టణంలో జిల్లా కేంద్రానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కోసం and స్థలాలు సేకరించేందుకు రెవిన్యూ సిబ్బంది మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే పోలీసు సిబ్బంది కూడా లా అండ్ ఆర్డర్ గతి తప్పకుండా చూసుకునేందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందన్నారు.



ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసిల్దార్ నరసింహ కుమార్,ఆర్.ఐ అజహర్ అలీ,సినియ అసిస్టెంట్ వినీత్ కుమార్ రెడ్డి,రెవెన్యూ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



 *MLA & Government Chief Whip Sri Srikanth Reddy for making Rayachoti a district is amazing, commendable*

*Tahsildar Subramanyam Reddy in 73rd Republic Day celebrations*
*Rayachoti News*
Government Chief Whip Gadikota Srikanth Reddy's effort is amazing and commendable to make Rayachoti district a very backward region. He hoisted the national flag in front of the local Tasildar office on the occasion of Republic Day on Tuesday. Later speaking, we are celebrating Republic Day today as a result of the results of the independence provided by many great people. The aim is to make Rayachoti as a district, on behalf of the people of the town, the government chief whip Gadiikota Srikanth Reddy, Rayachoti Revenue, is expressing heartfelt thanks to the people of the city. It is said that becoming the center of Rayachoti district is going to be very good for the residents of this area. Revenue staffs need to work more responsibly to collect necessary government offices and places for the district center in Rayachoti town in future. And police also say that they need to be more responsible to ensure law and order. Deputy Tahasildar Narasimha Kumar, R in this program. I Azhar Ali, Senior Assistant Vinit Kumar Reddy, Revenue, Police staff participated.
Share on Google Plus

About Indian Well Wisher

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

hindu names Rayachoti News quran neethistories bible neethikathalu health News moralkathalu comedykathalu yoga comedystories moralstories Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general Entertainment bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 Bhakthi కలతో‌వచ్చిన తిప్పలు Actress Jyothirlingam Schools Temples education Jobs Tirumala christian evari face choodali ? hanuman how to earn money with 100 rupees to crores said by bill gates ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నారాయణ నారాయణ నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం