Putukku Jara Jara Dubukku Me Movie Review | Rayachoti360
పుటుక్కు జర, జర - డుబుక్కు- మే అనే నానుడి ఎలా వచ్చిందో తెలుసా..
Putukku Jara Jara Dubukku Me Movie Review | Rayachoti360
అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి.
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
ఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా… ఆ గుమ్మడికాయలతోపాటు కాపురం చేయసాగింది.
తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డ వాటినల్లా కొరికేస్తూ, చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది.
ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదలిపెట్టదు.
రోజులలా గడుస్తుండగా.. ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల.
ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా..? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది.
దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ… డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే… మే… అని అరుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఇది ఒక శబ్ద ప్రధానమైన వాక్యము దీనిని తెనాలి రామలింగ కవి గారు సమస్యా పూరణము క్రింద ఇచ్చిన్నారు.
Putukku Jara Jara Dubukku Me Movie Review | Rayachoti360
ఎంతవరుకు నిజమో నాకు తెలీదు కాని మా అమ్మమ్మ చిన్నప్పుడు ఒక కథ చెప్పింది. ఆ కథ పేరు పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇప్పుడు ఆ కథలోకి వెళదాము.
పుటుక్కు జర జర డుబుక్కు మే
కథలోని పాత్రలు: Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
ఉడత (హెల్పింగ్ స్టార్ - అదేనండి సాయం చేసినా చేయకపోయినా నా పేరు వాడేస్తారు కదా; ఉడత సాయం)
గుమ్మడికాయ (పోలీస్ స్టార్ - అంటే ఎవడు ఏ మాయ మాట మాట్లాడినా ఏ దొంగతనం చేసినా నా ఊసే తీసుకుంటున్నారని నిరసనగా ఇలా డిసైడ్ చేశాను)
రేకుల షెడ్డు (సింపుల్ స్టార్ - ఎదో ఒక ట్యాగ్ లైన్ లేకపోతె ఏడుస్తుందని నోటికొచ్చింది పెట్టాను బాబయ్య జేజమ్మ)
మేక (తుమ్మ మొద్దు స్టార్ - తుమ్మ మొద్దు కనిపించిందంటే పండగే పండగ)
ఇక కథలోకి వస్తే…
ఒకానొక గ్రామంలో ఎదో ఒక మూలాన ప్లాము గట్టున ఒక రేకుల షెడ్డు ఉంది. ఆ షెడ్డు పైన ఒక గుమ్మాడి తీగ అల్లుకుని వుంది. ఒకానొక రేయి న మిన్ను మొత్తం కారు మాబులు కమ్ముకుని ఉండగా, ఒక అల్లరి మేక షెడ్డు నుంచి బయటకి వచ్చి సేద తీరుతోంది. ఎప్పుడు దాని కన్ను మూసుకుందో తెలీదు కానీ అది అలానే పడుకుండి పోయింది.
ఇంతలో ఒక చిన్ని ఉడత గుమ్మడి తీగెక్కి విరగ కాసిన ఒక గుమ్మడికాయని తిందామని ఆశగా 'పుటుక్కు' అని కొరికింది..
అప్పుడు గుమ్మడికాయ తెగి రేకుల మీద 'జర జరా' జారి..
కింద ఉన్న మేక మీద 'డుబుక్కు'మని పడింది
మేకేమో ఆ దెబ్బకి 'మే' అని అంది
అందుకే ఈ కథ పేరు.. పుటుక్కు జర జర డుబుక్కు మే..
ఎలా వుంది సరదా కథ??
నిజానికి ఈ నానుడి కేవలం శబ్ద ప్రధానమైనది అర్ధ ప్రధానమైనది కాదు.
ఈ నానుడి తెనాలి రామకృష్ణ కవి ఏదో సమస్యా పూరణ సందర్భం చెప్పారని అంటారు. అయితే ఆ సందర్భం ఏమిటో ఆ సమస్య ఏమిటో దానికి మన వికటకవి గారు చెప్పిన పద్యం ఏమిటో నాకైతే తెలీదు
Putukku Jara Jara Dubukku Me Movie Review | Rayachoti360
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
No comments:
Post a Comment