AP Gurukulam 5th Class Admissions 2021-22: APRS Online Application
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన.
APRS – V (Class) | |
Notification & Schedule | Click Here |
Press Note | Click Here |
Payment | Click Here |
Application Form | Click Here |
Payment Start Date | Payment End Date | 06/06/2021 | 30/06/2021 |
Application Start Date | Application End Date | 06/06/2021 | 30/06/2021 |
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. సంస్థ నడుపుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలల్లో(తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగినహళ్లి, అనంతపురం జిల్లాతో సహా)2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంగ్లిష్ మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.ఆర్. ప్రసన్న కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో జూలై 14న ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా పాఠశాల కేటాయిస్తారని తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 6(ఆదివారం) నుంచి 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in చూడాలని కోరారు.
ప్రవేశానికి అర్హతలు
ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2008నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలో 2019-21 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3-4 తరగతులు చదివి ఉండాలి. ఓసీ/బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. అభ్యర్థి తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయం (2020-21) రూ.లక్షకు మించరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
Website…
Important Dates of AP Gurukulam 5th Admission
Start Date | 06-06-2021 |
End Date | 30-06-2021 |
No comments:
Post a Comment