Repu evaru ika Telugu lo stories kathalu రేపు ఎవరికెరుక? | Rayachoti360
Repu evaru ika Telugu lo stories kathalu రేపు ఎవరికెరుక? | Rayachoti360
పాండవులు ఐదుగురూ అనామకులు-గా ఒక చిన్న పట్టణంలో ఉంటున్న సమయం అది. ఒక రోజున, ఇంకా తెల్లవారకనే ఎవరో వచ్చి, వాళ్ళు ఉంటున్న ఇంటి తలుపు తట్టారు. ధర్మరాజు వెళ్లి, తలుపు తీసి చూశాడు. చూస్తే, అక్కడున్నది ఒక బిచ్చగాడు!
repu evaru ika telugu lo stories kathalu రేపు ఎవరికెరుక?
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
ధర్మరాజుకు కొంచెం చికాకు వేసింది- ’తాము ఇంకా నిద్ర నుండి పూర్తిగా లేవనైనా లేవలేదు; అప్పుడే భిక్షకోసం వచ్చి నిలబడ్డాడా?’ అని. అనాలోచితంగా అతను అనేశాడు బిచ్చగాడితో- "రేపురావయ్యా" అని.
అంతలో ఇంటిలోపలి నుండి "హహ్హ హ్హా" అని గట్టిగా నవ్వులు వినబడ్డాయి. ఆ గొంతు-చూడగా, భీముడిది. ఏదో పెద్ద జోకు విన్నట్లు నేలమీద పడి దొర్లుతూ, కడుపు పట్టుకొని, పగలబడి నవ్వుతున్నాడు వాడు.
ధర్మరాజు లోపలికి వెళ్లి అరిచాడు, చెవులు మూసుకొని- "అబ్బ!ఆపు! ఎందుకట్లా నవ్వుతున్నావు? పిచ్చి గానీ పట్టలేదు గద! లేకపోతే ఏమైనా తిక్క పని చేశావా, మళ్ళీ? ఇంకా బాగా తెల్లవారనే లేదే, నీ తిక్క పనులకు?" అని.
ధర్మరాజుకు శాస్త్రాలన్నీ తెలుసు. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి, అతని పాండిత్యమే తరచు అతనికి అడ్డం వచ్చేది: అతని కళ్లముందు పదాలు, వాటికి ఉన్న విభిన్న అర్థాలు నిల్చేవి- మార్గం కానరాకుండా చూసేవి.
ఆ రోజూ అలాంటి రోజే- ధర్మరాజుకు తన బండ తమ్ముడు అట్లా నవ్వటం చూసి చికాకు వేసింది-" ఎందుకట్లా నవ్వుతున్నావు, భీమా?" అన్నాడు కోపంగా, దగ్గరకు వెళ్ళి.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
"నిన్ను చూసే నవ్వుతున్నాను- ఇంకెవర్ని చూసి నవ్వాలి? 'రేపు అంటూ ఒకటి ఉండబోతున్నద'ని నీకు ఎట్లా తెలుసు? సరే, ఒకవేళ ఆ ’రేపు’ ఏదో వచ్చిందే అనుకో- ఆనాటికి నువ్వూ, ఆ బిచ్చగాడూ- ఇద్దరూ బ్రతికే ఉంటారని ఎట్లా చెప్పగలవు?
ఆనాడు నువ్వు ఎక్కడుంటావో, వాడెక్కడుంటాడో!? కానీ నువ్వు మాత్రం ఆ బిచ్చగాడికి అద్భుతమైన ఆత్మ విశ్వాసంతో బదులిచ్చావు- ’రేపు రా’అని.
నేనిప్పుడే ఊరంతా చాటింపు వేసి చెప్పబోతున్నాను- 'మా అన్నకు అద్భుతమైన జ్ఞానం కలిగింది- రేపు ఏమి కానున్నదో చెబుతాడు ఆయన' అని! హీ హీ హీ!" అన్నాడు భీముడు, ఇకిలిస్తూ.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
ధర్మరాజు వెంటనే బయటికి పరుగెత్తి, ఆ బిచ్చగాడ్ని వెనక్కి పిలుచుకొచ్చాడు. అతనికి భోజనం పెట్టి కొన్ని డబ్బులిచ్చి, పంపేశాడు. తన ’బండ’తమ్ముడి సునిశితమైన వాస్తవిక దృష్టి, అతని కళ్లకు కమ్మిన పుస్తక పాండిత్యపు పొరల్ని కరిగించివేసింది. "నువ్వు సరిగ్గా కనుక్కున్నావు భీమా, ధన్యవాదాలు!" అన్నాడు తమ్ముడితో.
అప్పుడు భీముడు అన్నకు ఒక చక్కని కథ చెప్పాడు-
"ఒక రాజుగారి దర్బారులో ఒక మంత్రి ఉండేవాడు.ఆ మంత్రి చాలా తెలివైన వాడూ, లోకజ్ఞానం కలవాడు కూడా. అయినా ఒకసారి ఎందుకనో రాజుకు అతనిమీద విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, అతనికి మరణశిక్ష విధించి, మరుసటిరోజు ఉదయాన్నే దాన్ని అమలు చేయమన్నాడు.
మంత్రిగారి ఇంట్లో వాళ్ళంతా ఏడవటం మొదలెట్టారు. చుట్టుప్రక్కల వాళ్ళూ, బంధువులూ వచ్చి మంత్రిగారి భార్యను, పిల్లల్ని ఓదారుస్తున్నారు. "త్వరలో ఇక మంత్రిగారు ఉండరు." అని వాళ్లందరికీ అర్థమైంది. ఎందుకంటే వాళ్లంతా తమకు 'రేపు ఏం కానున్నదో తెలుసు' అనుకున్నారు.
అయితే మర్నాడు ఉదయాన, మంత్రిగారి శవానికి బదులు, స్వయంగా మంత్రిగారే ఇకిలించుకుంటూ ఇంటికి వచ్చారు!- అదిన్నీ రాజుగారు పెంచుకునే పంచ కళ్యాణి గుర్రాన్నెక్కి!
ఆయన్ని అలా చూడగానే, ఏడుస్తున్న బంధువర్గం అంతా ఒక్క క్షణం స్తంభించి-పోయింది- ఎవ్వరికీ నోట మాట లేదు. ముందుగా తేరుకున్న మంత్రి గారి భార్య లేచి వచ్చి, ’ఇంత అద్భుతంఎలా సాద్యమైంది?’ అని అడిగింది.
మంత్రిగారుచెప్పారు, చిద్విలాసంగా:"నా మృత్యుఘడియలు దగ్గర పడే సమయానికి, మమూలుగా రివాజు ప్రకారం రాజుగారు అక్కడికి విచ్చేశారు. ఆ సమయంలో ఏడుస్తున్న నన్ను చూసి, ఆయన "’నీకు చావంటే ఇంత భయం’ అని నేను అనుకోలేదు!" అన్నారు.”
" 'నేను ఏడుస్తున్నది నేను చచ్చిపోతానని కాదు! నాకు మాత్రమే తెలిసిన ఆ అద్భుతవిద్య, నాతోటే అంతమైపోతున్నదే, అని, నా బాధ!' అన్నాను నేను.”
'ఏమిటావిద్య?' అని అడిగారు రాజుగారు.
'కొన్నిరకాల గుర్రాలకు శిక్షణ ఇచ్చి, అవి గాలిలో ఎగిరేలా చేయటంవచ్చు, నాకు'అన్నాను నేను.
"రాజుగారికి ఆ ఐడియా నచ్చింది.- 'ఎన్నాళ్ళు పడుతుంది?' అని అడిగారు ఆయన.”
" 'ఒక సంవత్సరం పట్టవచ్చు' అన్నాను నేను. ఆయన నన్ను విడుదల చేసి, నాకు ఈ గుర్రాన్నిచ్చేశారు- 'సంవత్సర కాలంలో ఈ గుర్రాన్ని గాలిలో ఎగిరించగల్గితే నీకు నీ ప్రాణాలే కాదు, నా రాజ్యంలో 4వ వంతు ఇచ్చేస్తాను' అన్నారు!
అలా నేను ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాను!" అని. ఇది వినగానే మంత్రిగారి భార్య సంతోషం ఆవిరైంది: "నీకు గుర్రాలకు శిక్షణ నిచ్చేంత ప్రత్యేక శక్తులు ఏమీ లేవు కదా, ఎందుకు - అబద్ధం చెప్పావు? ఇలా చేస్తే నాకు ఏం సుఖం? ఇంకో సంవత్సరం పాటు నేను ప్రతి క్షణమూ కంగారు పడుతూ గడపాలి. అంత చేసినా సంవత్సరం తర్వాత నేను విధవరాలినవ్వక తప్పదు. అదేమి బ్రతుకు?! దీని కంటే ఏం జరగాలో అది ఒక్కసారిగా జరగటమే నయం!" అన్నది ఏడుస్తూ.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
మంత్రిగారు ఆమెని ఓదార్చి, ప్రేమగా తిట్టాడు- "తిక్కదానా! రేపు ఎవరికెరుక? రాజుగారు ఇంకో సంవత్సరం పాటు బ్రతికి ఉంటారని ఎవరికెరుక? నేను మాత్రం అంతకాలం ఉంటానని ఎవరు చెప్పగలరు?- ఆలోగా పరిస్థితులు ఎంత మారిపోవచ్చు! ఏదో ఒక సందర్భం వచ్చి, నేను రాజుగార్ని మెప్పిస్తే , అయన నన్ను క్షమించెయ్యవచ్చు- ఆలోగా వేరే ఏదైనా కావచ్చు కూడా. గుర్రం ఎగరనూ వచ్చు! భవిషత్తును ఎవ్వరూ ముందుగా కనుక్కోలేరని తెలీలేదా ఇంకా ? ఆందోళనను వదిలిపెట్టు.
ప్రస్తుతంలో బ్రతుకు. సంతోషంగా ఉండు!" అన్నాడు నవ్వుతూ.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
It was a time when the five Pandavas were living in a small town as strangers. One day, before dawn, someone came and knocked on the door of the house where they were staying. Dharmaraja went and opened the door. He saw that there was a beggar!
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
repu evaru ika telugu lo stories kathalu రేపు వరుకేరుక?
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
Dharmaraja was a little annoyed- 'You haven't woken up from your sleep yet; did you just come and stand there begging?' He thoughtlessly said to the beggar- "Come tomorrow."
Repu evaru ika Telugu lo stories kathalu రేపు ఎవరికెరుక? | Rayachoti360
At that moment, loud laughter was heard from inside the house, "Hahahahaha." That voice-when it turned out to be Bhima's. He fell to the ground, rolling around, holding his stomach, and laughing heartily, as if he had heard some great joke.
Dharmaraj went inside and shouted, covering his ears- "Oh! Stop! Why are you laughing like that? You're not even mad! Otherwise, have you done any dirty work, again? It's not even dawn yet, for your dirty work?" he said.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Dharmaraj knew all the sciences. But when it came to practice, his erudition often got in his way: words and their different meanings would stand in front of his eyes- they would make him look like a fool.
That day- Dharmaraj was annoyed to see his younger brother laughing like that- "Why are you laughing like that, Bhima?" he said angrily, going closer.
"I'm laughing at you - who else should I laugh at? How do you know that 'there is going to be a tomorrow'? Well, if that 'tomorrow' does come - how can you say that both you and that beggar - will be alive on that day? Where will you be on that day, where will he be!? But you replied to that beggar with amazing confidence - 'Come tomorrow'. I was just about to tell the whole town - 'My brother has amazing knowledge - he tells what will happen tomorrow'! Hee hee hee!" said Bhima, giggling.
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Dharmaraja immediately ran outside and called the beggar back. He fed him, gave him some money and sent him away. The sharp, realistic vision of his 'rock' brother melted away the layers of bookish erudition that had covered his eyes. "You've found the right one, Bhima, thank you!" he said to his younger brother.
Then Bhima told his brother a beautiful story-
"There was a minister in the court of a king. That minister was very intelligent and knowledgeable. However, one day, for some reason, the king became extremely angry with him. So angry that he sentenced him to death and ordered it to be carried out the next morning.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
Everyone in the minister's house started crying. The neighbors and relatives came and consoled the minister's wife and children. "Soon the minister will be gone." They all understood. Because they all thought that they knew what would happen tomorrow.
But the next morning, instead of the minister's dead body, the minister himself came home, limping! - All this on the Pancha Kalyani horse that the king was raising!
Seeing him like that, all the crying relatives froze for a moment - no one could say a word. There was no word. The minister's wife, who had recovered first, got up and asked, 'How was such a miracle achieved?'
Repu evaru ika Telugu lo stories kathalu రేపు ఎవరికెరుక? | Rayachoti360
The minister said, with a smile: "When my death was approaching, the king came there as usual. Seeing me crying at that time, he said, "'I didn't think you were so afraid of dying'!"
" 'I'm not crying because I'm going to die! That miraculous knowledge that only I know is ending with me, my sorrow!' I said."
'What kind of knowledge?' asked the king.
'I think we can train certain types of horses and make them fly in the air,' I said.
"The king liked the idea. - 'How long will it take?' he asked."
" 'It may take a year,' I said. He released me and gave me this horse - 'If you can fly this horse in the air within a year, I will give you not only your life, but a fourth of my kingdom'!
So I have reached here safely!" Hearing this, the minister's wife lost her joy: "You don't have any special powers to train horses, why - you lied? What good will it do me if I do this? I will have to spend every moment in anxiety for another year. Even if I do that, I will be a widow after a year. What is life?! What can happen to this, it is better to do it all at once!" she cried.
The minister consoled her and scolded her lovingly - "You fool! Who cares about tomorrow? Who cares that the king will live for another year? Who can say that I will live that long? - How much things can change in the meantime! If some occasion comes and I please the king, he may forgive me - and in the meantime, something else may happen. The horse may even fly! Don't you know that no one can predict the future? Stop worrying. Live in the present. Be happy!" he said, laughing.
Repu evaru ika Telugu lo stories kathalu రేపు ఎవరికెరుక? | Rayachoti360
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
No comments:
Post a Comment