భారత సైన్యానికి కొత్తగా 50వేల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
భారత సైన్యం కోసం 50000 కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఫ్రంట్ లైన్ సైనికులకోసమని తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. జూన్ నెలలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేసే కంపెనీలను టెండర్లకు ఆహ్వానించాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భావిస్తోంది. 12-24 నెలల సమయంలో వీటిని తయారు చేయడమే కాకుండా.. పరీక్షలు కూడా నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు.
7.62 ఎం.ఎం. బుల్లెట్ల నుండి సైనికులను కాపాడే విధంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెబుతోంది. 10 మీటర్ల దూరం నుండి కాల్చిన హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను కూడా తట్టుకునే విధంగా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయాలని కంపెనీలను ఆదేశించారు. ముఖ్యంగా ఈ జాకెట్ల బరువు విషయంలో కూడా నియమాలను తీసుకుని వచ్చింది. 10 కేజీల కంటే తక్కువ బరువు ఈ జాకెట్లు ఉండాలని సూచించింది.
జాకెట్ ఔటర్ టాక్టికల్ వెస్ట్ లో ఎస్.ఐ.జి. 716 రైఫిల్ కు చెందిన మూడు మ్యాగజైన్లు పట్టే వీలుండాలని ఆర్మీ అధికారులు సూచనలు జారీ చేశారు. అలాగే ఏకే-203 అసాల్ట్ రైఫిల్ ను కూడా తీసుకుని వెళ్లేలా ఉండాలని అన్నారు. హ్యాండ్ గ్రెనేడ్స్, హ్యాండ్ హెల్డ్ రేడియో సెట్స్, కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లేలా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించాలని కంపెనీలకు సూచించారు.
ఒకానొక సమయంలో భారత సైన్యం దగ్గర తగినన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేకుండా ఉన్న సంగతి తెలిసిందే..! బహిరంగంగానే సైనికులు తమకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేవని ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. సైన్యానికి కావాల్సిన ఆయుధాలను, వారి అవసరాలను తీర్చడానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. 10 లక్షలకు పైగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సైన్యానికి అందించామని డిఫెన్స్ మినిస్టర్ శ్రీపాద్ నాయక్ సగర్వంగా చెప్పారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కొన్ని స్వదేశీ కంపెనీలే తయారు చేశాయి. డీఆర్డీఓ కూడా లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేస్తోంది.
Source & Credit - https://nationalisthub.com/army-to-procure-50000-bulletproof-jackets-for-its-frontline-troops/
No comments:
Post a Comment