COVID19 Cases in India as of today - తగ్గుతున్న కరోనా కేసులు
తగ్గుతున్న కరోనా కేసులు.. గత 24గంటల్లో కోలుకున్న 2,55,287 మంది
కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో నిన్న 1,27,510 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 2,55,287 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. మరో 2,795 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో మృతుల సంఖ్య మొత్తం 3,31,895కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,59,47,629 మంది కోలుకున్నారు. 18,95,520 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,60,46,638 మందికి వ్యాక్సిన్లు వేశారు.
31-05-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,524 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 307 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,78,351 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. 5,40,986 మంది కోలుకున్నారు. ఇంకా 34,084 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతూ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలని జగన్ ఆదేశించారు. విద్యార్థులతో పాటు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ ఇచ్చినట్టు వారికి ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను వైసీపీ ప్రభుత్వం గుర్తించి.. వీరిలో 43 మందికి రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం డిపాజిట్ చేసింది.
Source & Credit - https://nationalisthub.com/covid-19-cases-updates-on-01-06-2021/
No comments:
Post a Comment