ప్రధాని నరేంద్ర మోదీకి 6 సంవత్సరాల కాశ్మీరీ బాలిక రిక్వెస్ట్ ఇదే..
ప్రధాని మోదీకి 6 సంవత్సరాల కాశ్మీరీ బాలిక రిక్వెస్ట్ ఇదే.. - 6 Year Kashmiri Girl Complaint to PM Modi -
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు చదువుకోడానికి పాఠశాలలకు వెళ్లాల్సిన అవకాశం లేకుండా పోయింది. కేజీ నుండి పీజీ దాకా ఆన్ లైన్ లో క్లాసులు వింటూ ఉన్నారు. అయితే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో ఆరేళ్ళ బాలిక ‘మోదీ సాహెబ్’ అంటూ తన బాధను మొత్తం వెళ్లగక్కింది.
కాశ్మీర్ కు చెందిన ఆ బాలిక చిన్న పిల్లలను ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఎందుకంత ఇబ్బంది పెడతారు. ఉదయం నుండీ క్లాసులు అవసరమా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎంతో హోమ్ వర్క్ ను ఇస్తూ ఉన్నారని ఆమె పిర్యాదు చేసింది. ఆన్ లైన్ క్లాసులు 10 గంటలకు మొదలై 2 గంటలకు ముగిస్తూ ఉన్నారని.. అందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఉర్దూ, ఈవీఎస్, కంప్యూటర్ వంటి ఎన్నో సబ్జెక్టులను చెబుతూ ఉన్నారని.. చిన్న తరగతుల పిల్లలకు ఇన్ని అవసరమా అని ఆ బాలిక క్యూట్ గా అడిగింది. ‘మోదీ సాహెబ్’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించడం కూడా ఎంతో హైలైట్ గా నిలిచింది. చిన్న చిన్న పిల్లలకు ఎందుకు మేడమ్/సార్ లు ఇంత పని పెడతారు అంటూ బాధను చెప్పేసుకుంది. అంత పెద్ద పెద్ద పనులు చిన్న పిల్లలకు చెప్పకండి అంటూ తెలిపింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఇబ్బందులు పడుతోన్న ఎంతో మంది చిన్నారుల తరపున ఈ బాలిక మాట్లాడిందంటూ పలువురు ప్రముఖులు కూడా వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పిర్యాదుపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు. ‘ఎంతో ముద్దుగా పిర్యాదు చేసిందని.. చిన్న పిల్లలకు 48 గంటల కంటే తక్కువగా క్లాసులు ఉండాలనే పాలసీని తప్పక పాటించాలని.. హోమ్ వర్క్ కూడా తక్కువగా ఇవ్వాలని’ సూచించారు.
ప్రధాని మోదీకి 6 సంవత్సరాల కాశ్మీరీ బాలిక రిక్వెస్ట్ ఇదే.. - 6 Year Kashmiri Girl Complaint to PM Modi -
No comments:
Post a Comment