Kucheludu Kamsudu Kabandudu | కుచేలుడు, కంసుడు, కబంధుడు | Rayachoti360
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- Kucheludu Kamsudu Kabandudu | కుచేలుడు, కంసుడు, కబంధుడు | Rayachoti360
Kucheludu : కుచేలుడు --
చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు.
కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుదాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కంధములో వస్తుంది.
కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేసేటపుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి సహాధ్యాయి. విద్యాభ్యాస మయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకోగా, కుచేలుడు తన స్వగ్రామము చేరుకొంటాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ సంతానం కలుగుతుంది. అధిక సంతానముతో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే, కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని రమ్మంటుంది.
కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతూండగా అతనిని భార్య ఒక చిన్నఅటుకుల మూట ఇస్తుంది. కుచేలుడు ద్వారక చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజప్రాసాదాలూ చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడినప్పటికీ, లోకరక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం అతనికి లభిస్తుంది. శ్రీకృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసన మిచ్చి, కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సుపై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు అతడి అదృష్టాన్ని కొనియాడుతారు.
సపర్యలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి గురుపత్ని దర్భలు తెమ్మని పంపగా వర్షము పడడం వల్ల ఎంతకూ తిరిగి రాకపోవడంతో మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని గుర్తు చేసుకుంటారు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకు వచ్చావు అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచబోతూంటే శ్రీకృష్ణుడు ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు తినబోతుండగా రుక్మిణి, స్వామీ మీరు మొదటి సారి అటుకులు తిన్నపుడే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.
KamsuDu : కంసుడు --
ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు
కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర.
ఉగ్రసేనుడు అనె యాదవ రాజుకు కొడుకు. మధురాపురమునకు రాజు. శ్రీకృష్ణుని మేనమామ. ఇతడు పూర్వజన్మమునందు కాలనేమి అను రాక్షసుడు. కనుక ఈ జన్మమందును ఆవాసన తప్పక దేవతలకు విరోధియై అనేకులను రాక్షసులను తోడుచేసికొని సాధువులను బాధించుచుండును. ఇట్లు ఉండి ఒకనాడు తన చెల్లెలు అగు దేవకీదేవిని వసుదేవునకు ఇచ్చి వివాహముచేసి ఆవధూవరులను రథముమీఁద కూర్చుండఁబెట్టుకొని తాను సారథియై మిక్కిలి ఉత్సాహముతో రథమును తోలుకొని పోవుచు, "నీచెల్లెలి యొక్క యెనిమిదవ కొడుకు నిన్ను చంపును" అను మాట ఒకటి చెవిని పడఁగానే మనసు చలింపఁగా, తటాలున రథమునుండి దిగి చెల్లెలు ఐన దేవకీ దేవిని కొప్పుపట్టి ఈడ్చి నేలఁబడవేసి తల నరికి చంపఁబోయెను. అప్పుడు వసుదేవుఁడు బహువిధముల వేఁడుకోఁగా, చంపక విడిచి పెట్టి అది నిమిత్తముగా దేవకీవసుదేవులకు సంకెళ్లువేసి కారాగృహమునందు ఉంచి దేవకి కన్నకొడుకులను ఎల్లను చంపుచువచ్చి, కడపట యోగమాయవల్ల కృష్ణుఁడు వ్రేపల్లెలో నందునియింట చేరి ఉన్న సమాచారముతెలిసి, అతని చంపుటకు బహుప్రయత్నములుచేసి కడపట అతనిచేతనే చంపబడెను.
KabanduDu : కబంధుడు --
రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యము లో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.
No comments:
Post a Comment