Veta hunting Telugu lo stories kathalu వేట | Rayachoti360
Veta hunting Telugu lo stories kathalu వేట | Rayachoti360
సువర్ణ నగరాన్ని పాలించే రాజు ధనవర్మకు వేట అంటే మహా ఇష్టం. ఒక రోజున రాజు వేటకు వెళ్తుండగా, దారిలో రెండు పులి పిల్లలు కనిపించాయి. రాజు ఆ రెండు పులి పిల్లలను తీసుకొని రాజధానికి తిరిగి వచ్చి, వాటిని ప్రేమగా సాకాడు. వాటిలోఒకదాని పేరు మాయ, రెండవదాని పేరు బుజ్జి. ఆ రెండూ రాజుపట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉండేవి.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
కానీ రాజుకు మాత్రం ఒక్కటే దిగులు- అదేమిటంటే, "అయ్యో! నాకింకా పెళ్ళి కాలేదే!" అని. ఆ సంగతి తెలుసుకున్న పులిపిల్లలు రెండూ రాజుకు తగిన భార్యను వెతకటం కోసం బయలుదేరి పోయి, దేశ దేశాలూ తిరిగాయి. చివరికి సదిశా రాజ్యం చేరుకొని, పౌరులెవ్వరికీ కనబడకుండా ఆ దేశపు రాజుగారి తోటలోకి దూరాయి.
ఆ రాజుగారి బిడ్డ పద్మ- చాలా అందమైనది. ఆమె చెలికత్తెలతో కలిసి అక్కడ ఆటలాడుతూ, అకస్మాత్తుగా పులిపిల్లలను చూసి "వామ్మో! పులి పిల్లలు!" అని గట్టిగా అరిచింది.
కానీ చాలా తెలివైన మాయ, బుజ్జిలు సైనికులు వచ్చేలోపు అక్కడినుండి పారిపోయి, సువర్ణ నగరం చేరుకున్నాయి.
Veta hunting Telugu lo stories kathalu వేట | Rayachoti360
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
ధనవర్మ ఆ పులులను చూసి "అరే! మీరు ఎక్కడికో పారిపోయారే, అని ఎంత దిగులు పడ్డానో తెలుసా?" అన్నాడు సంతోషంగా. అప్పుడా పులి పిల్లలు "మేం నీకోసం ఎంత మంచి యువరాణిని వెతికి పెట్టామో తెలుసా?" అని, సదిశారాజ్యపు రాజుగారి బిడ్డ గురించి చెప్పాయి.
ధనవర్మ సదిశారాజ్యం చేరుకునే సరికి రాజుగారు పద్మకు స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నారు- వేగంగా పరుగులెత్తే చిరుతపులికి తగిలేట్లుగా మూడు బాణాలు వేసినవారికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తానని ఆయన ప్రకటించాడు. ఆ పోటీలో ఇతరులెవ్వరూ నెగ్గలేదు. వేటలో అనుభవం గల ధనవర్మ, సునాయాసంగా చిరుతపులిని చంపి, యువరాణి పద్మను పెళ్ళిచేసుకున్నాడు.
రాజు, రాణి కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తరువాత, పొరుగు రాజ్యపు సూర్యవర్మ సువర్ణనగరం మీదికి దండెత్తి వచ్చాడు.
సూర్యవర్మకు అపారమైన సైన్యం ఉన్నది. 'అతనితో ఎలా తలపడాలా' అని బాధపడుతున్న ధనవర్మతో పులులు "రాజా! దీనికి చింత ఎందుకు? మమ్మల్ని యుద్ధానికి పంపు. రక్తపాతం లేకుండానే సమస్యను మేం పరిష్కరిస్తాం" అన్నాయి. రాజు వాటిని ముందుగా శత్రువులమీదికి వదిలాడు. వాటిని చూడగానే శత్రు సైన్యాలు వెనక్కి పరుగు తీశాయి. తన రాజ్యాన్ని కాపాడిన పులులు రెండింటినీ రాజు ఎంతో మెచ్చుకున్నాడు.
అయితే రాజుగారి వేటపిచ్చి రాజ్యానికే ప్రమాదం కొని తెచ్చింది. రాజును ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ ఇష్టం వచ్చినట్లు వేటాడి, అడవిలోని జంతువులన్నిటినీ చంపేశారు. అడవుల్లోని చెట్లు, చేమలు అన్నీ ఒక్కటొక్కటే నేలకూలాయి.
పర్యావరణం పాడవ్వటం మూలంగా రాజ్యానికి కరువుకాలం వచ్చింది. వానలు లేవు. అడవిలో మిగిలిన క్రూరమృగాలు పల్లెసీమల్లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు తినెయ్యటం మొదలెట్టాయి.
ఏం చెయ్యాలో తెలీక తల పట్టుకున్న ధనవర్మతో పులులు - "రాజా, మీ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలన్నిటినీ రాజ్యంలోని ప్రజలకు పంచిపెట్టండి. మమ్మల్ని అడవిలోకి వదిలి పెట్టండి. వేటను నిషేధించండి. మిగిలినది మేం చూసుకుంటాం " అని అన్నాయి.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
"సరే" అని రాజుగారు తన దగ్గరున్న ఆహార ధాన్యాలను ప్రజలకు పంచిపెట్టి, పులులను అడవిలో విడిచాడు. మాయ, బుజ్జి ఆపైన అడవుల సంరక్షణకు పూనుకున్నాయి. త్వరలోనే అడవులన్నీ మళ్ళీ చెట్టు చేమలతో కళకళలాడాయి. జంతువులన్నీ తిరిగి అడవుల్లోకి వచ్చాయి. కరువు తీరి రాజ్యం సుభిక్షం అయ్యింది.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Veta hunting Telugu lo stories kathalu వేట | Rayachoti360
King Dhanavarma, who ruled the Golden City, was very fond of hunting. One day, while the king was going hunting, he saw two tiger cubs on the way. The king took the two tiger cubs and returned to the capital and raised them lovingly. One of them was named Maya and the other was named Bujji. Both of them were very fond of the king.
But the king had only one worry - "Oh! I am not married yet!" Knowing this, the two tiger cubs set out in search of a suitable wife for the king and traveled all over the country. Finally, they reached the kingdom of Sadisha and, without being seen by any of the citizens, they entered the garden of the king of that country.
The king's daughter, Padma, was very beautiful. She was playing there with her friends, when she suddenly saw the tiger cubs and shouted loudly, "Wow! Tiger cubs!"
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
But Maya and Buzji, who were very clever, escaped from there before the soldiers arrived and reached the Golden City.
Seeing the tigers, Dhanavarma said happily, "Hey! Do you know how worried I was that you ran away somewhere?" Then the tiger cubs said, "Do you know how good a princess we have found for you?" and told about the child of the king of Sadisha.
When Dhanavarma reached Sadisha, the king had arranged a swayamvaram for Padma - he announced that he would give his child in marriage to the one who could shoot three arrows that would hit the fast-running leopard. No one else won that competition. Dhanavarma, who was experienced in hunting, easily killed the leopard and married Princess Padma.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
After the king and queen spent some time happily, Suryavarma of the neighboring kingdom invaded the Golden City. Suryavarma had a huge army. Dhanavarma, who was worried about how to fight him, said to him, "King! Why worry about this? Send us to war. We will solve the problem without bloodshed." The king released them first against the enemy. On seeing them, the enemy army ran back. The king greatly appreciated both the tigers who protected his kingdom.
However, the king's hunting madness brought danger to the kingdom. All the people, who took the king as an example, hunted as they pleased and killed all the animals in the forest. All the trees and bushes in the forest fell to the ground one by one. Due to the destruction of the environment, the kingdom experienced a drought. There was no rain. The remaining wild animals in the forest entered the countryside and started eating whoever they found.
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
The tigers, who were unsure of what to do, said to Dhanavarma, "King, distribute all the food grains you have to the people of the kingdom. Leave us in the forest. Ban hunting. We will take care of the rest."
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
"Okay," said the king, distributing the food grains he had to the people and releasing the tigers into the forest. Maya, Bujji and others set out to protect the forests. Soon, the forests were once again covered with trees. All the animals returned to the forests. The drought was over and the kingdom became prosperous.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
No comments:
Post a Comment