దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) Daiva Sura Sampada Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) Daiva Sura Sampada Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం)
శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.
దైవగుణాలు:
భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం,
తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి,దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
రాక్షసగుణాలు:
గర్వం,
పొగరు,
దురభిమానం,
కోపం,
పరుషత్వం,
అవివేకం.
దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు.
దైవ,రాక్షస స్వభావులని రెండు రకాలు.రాక్షసస్వభావం గురించి చెప్తాను.
మంచీచెడుల విచక్షణ,శుభ్రత,సత్యం,మంచి ఆచారం వీరిలో ఉండవు.
ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని,స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు.
వీరు లోకకంటకమైన పనులు చేస్తారు.కామం కలిగి దురభిమానం,డంభం,మదం,మూర్ఖ పట్టుదల కలిగి అపవిత్రంగా ఉంటారు.
కామం,కోపాలకు బానిసలై,విషయవాంఛలే ముఖ్యంగా వాటి అనుభవం కోసం అక్రమ ధనార్జన చేస్తూ నిత్యం ఆశలలో చిక్కుకొని ఉంటారు.
"ఇది నాకు దొరికింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది,ఇంకా వస్తుంది.ఈ శత్రువును చంపాను.
మిగిలిన శత్రువులందరినీ చంపుతాను.నేను సర్వాధికారిని. బలవంతుడిని,సుఖిని,ధనికుడిని.
నాకెదురు లేదు.నాకు ఎవరూ సమానం కాదు.యాగలూ,దానాలూ చేస్తాను.నేనెప్పుడూ సంతోషినే"అని అనుకుంటూ కామం,భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని వీడి పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి అసూయతో అంతర్యామి నైన నన్ను తిరస్కరిస్తారు.
వీరు తిరిగితిరిగి ఇలాంటి జన్మలే పొందుతారు.వీరు ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతకూ హీనజన్మలనే పొందుతుంటారు.
కామం,కోపం,పిసినారితనం ఈ మూడూ నరకానికి తలుపులు.ఆత్మజ్ఞానమును నాశనం చేస్తాయి.కాబట్టి ఈ మూడింటినీ వదిలిపెట్టాలి.
వీటిని వదిలిన వాడే తపస్సు,యాగం మొదలగు వాటి వలన ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు.
వేదశాస్త్రాలను లక్ష్యపెట్టని వారికి శాంతి లేక మోక్షం లభించవు.
కాబట్టి ఏ పనిచెయ్యాలి,చేయకూడదు అన్నదానికి వేదశాస్త్రాలే నీకు ప్రమాణం.వాటి ప్రకారమే నీ కర్మలను చెయ్యి.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
16.దైవాసురసంపద్విభాగ యోగము - షోడశాధ్యాయము
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది.
దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి.
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ, గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట, చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము,
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కొమలత్వము,
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమా, ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) Daiva Sura Sampada Yogam Telugu Bhagavad Gita | Rayachoti360
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
No comments:
Post a Comment