భూచక్రగడ్డ - Bhoochakra Gadda - Bhu Chakra Gadda in Telugu Useful
Bhoochakra Gadda - Bhu Chakra Gadda in Telugu Useful
భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో 'మాగడ్డ' అని కూడా పిలుస్తారు. కేవలం నల్లమల అటవీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీశైలం నుంచి గిద్దలూరు వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రమే భూచక్రగడ్డ దొరుకుతుంది.
ఈ దుంపకి చెంచులకూ అవినాభావ సంబంధం ఉంది.
భూచక్రగడ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గడ్డ దొరికితే కుటుంబమంతా కనీసం నెలరోజులు బతికే ఆదాయాన్నిస్తుంది కనుకనే దీనిని లక్ష్మిగడ్డ అని, లచ్చిగడ్డ అని కూడా పిలుస్తుంటారు. .
నరసింహస్వామిని ఆరాధించే చెంచులు భూచక్రగడ్డను నరసింహస్వామి ప్రసాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీనిని గడ్డప్రసాదమని చెబుతారు.
భూచక్రగడ్డ … మీటరు నుంచి 20 మీటర్ల పొడవు దాకా భూమిలో పది, పన్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచక్రగడ్డ దొరికే అవకాశం వుండే ప్రాంతాల్లో ఒక విధమైన మత్తులాంటి వాసన వస్తుందట. ఈ వాసనను పసిగట్టే చెంచులు గడ్డ కోసం వేటమొదలు పెడతారు.
భూచక్రగడ్డ ఎంత సన్నటి లేయర్ వుంటే అంత ఎక్కువ రుచి వుంటుంది.తీపిగా వుండదని పంచదార చల్లి అమ్ముతుంటారు.
కానీ పంచదార లేకుండా తినడమే మంచిది.
భూచక్రగడ్డ - Bhoochakra Gadda - Bhu Chakra Gadda in Telugu Useful
No comments:
Post a Comment