తెలివి - లేమి - Knowledge Telugu lo stories kathalu | Rayachoti360
తెలివి - లేమి - Knowledge Telugu lo stories kathalu | Rayachoti360
తెలివి - లేమి
విజయేంద్రవర్మ అనే రాజుకు ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు జయుడు, చిన్నవాడి పేరు విజయుడు.
విజయేంద్రవర్మకు వయసు మీదపడినకొద్దీ 'తన తరువాత రాజ్యాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా' అని దిగులు పట్టుకున్నది. ఇద్దరూ సమర్థులే, మరి!
చివరికి ఆయన ఒకనాడు ఇద్దరు కొడుకులనూ పిలిచి, దేశాటనకు వెళ్లి కొత్త కొత్త విషయాలను నేర్చుకు రమ్మన్నాడు.
సరేనన్న రాజ కుమారులు ఇద్దరూ రెండు దిక్కులకు బయలుదేరి వెళ్లారు. తూర్పు వైపుకు వెళ్ళిన జయుడు ఆ రాత్రికి ఒక గ్రామంలో బసచేశాడు. విశ్రాంతి తీసుకుంటూ, "నేనే రాజునవుతాను. దానికోసం ఏమైనా మంత్రశక్తిని సంపాదిస్తాను. ఆ విద్యతో తండ్రిగారిని మెప్పిస్తాను." అనుకున్నాడు. తెల్లవారిన తరువాత విచారించగా, అక్కడికి దగ్గర్లోనే మహిమాన్వితుడైన ఋషి ఒకాయన నివసిస్తుంటాడని తెలిసింది. జయుడు వెళ్ళి ఋషికి మర్యాదగా నమస్కరించి, తనెవరో ఋషికి వివరించాడు. 'చనిపోయిన జీవులకు ప్రాణం పోసే విద్యను నేర్పమ'ని ఆయన్ను ప్రార్ధించాడు.అందుకు ఆ ఋషి , "అలాంటి విద్యలు అందరికీ పనికిరావు. వేరే విద్యలు ఏమైనా నేర్చుకుందువులే" అన్నాడు.
కానీ జయుడు తనకు ఆ విద్యే కావాలని బ్రతిమాలాడు. ప్రేమాన్వితుడైన ఋషి కాదనలేక, జయుడికి ఆ విద్యను నేర్పనారంభించాడు.
ఇక పడమర దిక్కుకు వెళ్ళిన విజయుడు కూడా ఒక అడవిని చేరుకున్నాడు. ఆ అడవిలో చిన్న చిన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడి గ్రామస్థులందరూ, ప్రపంచం మునిగిపోతున్నట్లు బాధపడుతూ కనబడ్డారు.
"సంగతేమిట"ని అడిగిన విజయుడితో ఒక అవ్వ అన్నది: "బాబూ! ఈ అడవిలో అనేక రకాల కౄరమృగాలు, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు మా గ్రామాలమీద పడి, పశువులనూ, మనుషులనూ కూడా తినేస్తున్నాయి. ఈ సంగతిని అనేకసార్లు రాజుగారితో మనవి చేసుకున్నాం. కానీ రాజుగారు మా కష్టాన్ని అస్సలు పట్టించుకోలేదు" అని చెప్పింది.అవ్వ మాటలు విన్న విజయుడికి అది రాజగౌరవానికే మచ్చ అనిపించింది.
'ప్రజలకు రక్షణ కల్పించటం రాజు బాధ్యత. అది నెరవేర్చకపోతే తాను రాజయ్యీ ఏమి లాభం?' అనుకొని, విజయుడు అక్కడే నిలచిపోయాడు. గ్రామవాసుల కష్టాలను తీర్చటంకోసం గ్రామ రక్షక దళాలను తయారు చేశాడు. యువకులకు యుద్ధవిద్యల్లో శిక్షణనిచ్చాడు. తానూ అక్కడే ఉండి, గ్రామాలలోకి వచ్చిన కౄరజంతువులను ఆ యువకుల సాయంతో చంపేశాడు. అలా గ్రామీణ సమాజం గురించీ, సంస్థా నిర్మాణం గురించీ, యుద్ధవిద్యలను గురించీ విజయుడు అనేక విషయాలు తెలుసుకున్నాడు.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
అంతలోనే దేశాటనకు తండ్రిగారు ఇచ్చిన కాలం అయిపోవటంతో అన్నదమ్ములిద్దరూ రాజధానికి చేరుకున్నారు.
సభలో రాజుగారు "దేశాటనలో మీరు చూసినవీ, చేసినవీ, నేర్చుకున్నవీ ఏమిటో చెప్ప"మని అడిగారు జయవిజయుల్ని.
తను నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలని అప్పటికే ఎంతో ఆత్రంగానూ, ఆరాటంగానూ ఉన్న జయుడు, తనతోబాటు తెచ్చుకున్న ఒక సింహం మృతదేహాన్ని సభలోకి రప్పించాడు. ముందుగా దాన్ని అందరికీ ప్రదర్శించి, దానితో ఏం చేయబోతున్నాడో ఎవరైనా ఊహించేలోపు, క్షణాలలో దానికి ప్రాణం వచ్చేట్లు చేశాడు.
జీవం పోసుకున్న ఆ సింహం పెద్దగా గర్జిస్తూ తన ఎదుటే నిలబడ్డ జయుడి మీదికి ఉరికింది. సభ మొత్తం భయంతో ఒక్కసారిగా వణికిపోయింది. సభికులు గందరగోళంగా ఎక్కడివారక్కడ ద్వారాలవైపుకు పరుగులు తీశారు.
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
సింహానికి ప్రాణం పోసేటప్పుడు, జయుడు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అందువల్ల సింహం మీదికి దూకగానే, చేత ఆయుధంలేక, అతడు ఆత్మ రక్షణ మాట మరచి, సామాన్యుడికి మల్లే ముడుచుకుని కూర్చుండిపోయాడు. అదే క్షణంలో విజయుడు ఒక్క ఉదుటున ముందుకు దూకి, తన కరవాలంతో ఆ సింహాన్ని తిరిగి యమపురికి పంపేశాడు.
సభికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ విజయుడి ధైర్యాన్నీ, నేర్పునూ కొనియాడారు. జయుడు కూడా తమ్ముణ్ని అభినందించాడు.
ఆ తరువాత విజయుడు, దేశాటనలో తాను చేసిన పనులను వివరించగానే, సభలోని వారంతా అతన్ని మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు.
ధైర్య సాహసాలతోబాటు నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న విజయుడినే రాజ్యలక్ష్మి వరించింది. జయుడు తమ్మునికి తోడునీడగా వ్యవహరించాడు.
విజయుని పాలనలో ప్రజల కష్టాలు అన్నీ తీరి, సంతోషం వెల్లివిరిసింది.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
తెలివి - లేమి - Knowledge Telugu lo stories kathalu | Rayachoti360
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Lack of knowledge
A king named Vijayendravarma had two sons. The elder's name was Jaya and the younger's name was Vijaya.
As Vijayendravarma grew older, he began to worry about who would take over the kingdom after him. Both were capable, after all!
Finally, one day, he called both his sons and told them to go to the country and learn new things.
The two sons agreed and set off in different directions. Jaya went east and stayed in a village that night. While resting, he thought, "I will become the king. For that, I will acquire some kind of magical power. I will please my father with that knowledge." When he inquired after dawn, he found out that a great sage lived nearby. Jaya went and respectfully bowed to the sage and explained to him who he was. He prayed to him to teach him the knowledge that can give life to dead beings. To this the sage said, "Such knowledge is not useful to everyone. One should learn some other knowledge."
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
But Jayayudu begged for that knowledge. The loving sage could not refuse and started teaching Jayayudu that knowledge.
Vijayudu, who went west, also reached a forest. There were many small villages in that forest. All the villagers there were seen suffering as if the world was sinking.
"What's the matter?" asked Vijay. An old woman said to him, "Sir! There are many kinds of wild animals in this forest. Whenever they come, they attack our villages and eat both livestock and people. We have complained to the king about this many times. But the king has not paid any attention to our difficulties." Hearing the old woman's words, Vijay felt that it was a stain on his royal dignity.
'It is the king's responsibility to protect the people. If he does not fulfill that, what is the use of him as a king?' Vijay thought and stayed there. He formed village protection forces to solve the problems of the villagers. He trained the youth in martial arts. He himself stayed there and killed the wild animals that came into the villages with the help of the youth. In this way, Vijay learned many things about rural society, organizational structure, and martial arts.
Meanwhile, the time given by his father for the country tour had expired, and the two brothers reached the capital.
In the assembly, the king asked Jayavijay to "Tell me what you have seen, done, and learned in the country tour."
Jaya, who was already very eager and eager to demonstrate the knowledge he had acquired, brought the body of a lion he had brought with him into the assembly. First, he showed it to everyone, and before anyone could guess what he was going to do with it, he brought it to life in a matter of moments.
The lion, which had come to life, roared loudly and pounced on Jaya, who was standing in front of him. The entire assembly suddenly trembled with fear. The courtiers ran towards the gates in confusion.
While bringing the lion to life, Jaya did not expect this to happen. Therefore, as soon as he jumped on the lion, without a weapon in his hand, he forgot the word of self-defense and sat down with a common man's bow. At that moment, Vijaya jumped forward with one lunge and sent the lion back to Yamapur with his chariot.
All the courtiers breathed a sigh of relief. Everyone praised Vijaya's courage and skill. Jaya also congratulated his younger brother.
Then, when Vijaya explained the work he had done in the country, everyone in the court applauded him.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
In addition to his courage and adventure, Vijaya, who was committed and aware of the problems of the people, was blessed with Rajya Lakshmi. Jaya acted as a companion to his younger brother.
During Vijaya's rule, all the difficulties of the people were resolved and happiness prevailed.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
తెలివి - లేమి - Knowledge Telugu lo stories kathalu | Rayachoti360
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
తెలివి - లేమి - Knowledge Telugu lo stories kathalu | Rayachoti360
No comments:
Post a Comment