Ghnana yogam in Telugu Bhagava Gita | జ్ఞానయోగము 4 వ అధ్యాయం
Ghnana yogam in Telugu Bhagava Gita | జ్ఞానయోగము 4 వ అధ్యాయం - జ్ఞానయోగము (4 వ అధ్యాయం)
ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది.
అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?"అన్నాడు.
Ghnana yogam in Telugu Bhagava Gita | జ్ఞానయోగము 4 వ అధ్యాయం
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
కృష్ణుడు "నీకు,నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు.నీకు తెలియదు.నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను.
ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను.
ఈ విధంగా తెలుసుకొన్నవాడు,రాగ,ద్వేష,క్రోధ,భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు.
నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను.మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు.
గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను.నేను ఆకర్తను,అవ్యయుడను.నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు.ఇలా చేసేవారిని కూడా అంటవు.జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు.
ఏ కర్మలు చేయాలో,ఏవి చేయకూడదో చెప్తాను విను.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
కర్మ, అకర్మ, వికర్మ అని మూడు రకాలు.కర్మగతి గాఢమైనది. కర్మలలో ఆకర్మలను, ఆకర్మలలో కర్మలను చూసేవాడు, ఫలాపేక్షరహితుడు, కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలేనివాడు, జయాపజయాల పట్ల సమబుద్దిగలవాడు,సందేహరహితుడు,ఈర్ష్యారహితుడు బంధాలలో చిక్కుకోడు.
ఈశ్వరప్రీతిగా మాత్రమె కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు.
ఇవ్వబడునది,ఇచ్చేవాడు,ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.
కొందరు ఆత్మను ఆత్మ యందె,ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో,మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో ,మరికొందరు వాయుగమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని ,ప్రాణంలో అపానాన్ని,ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.
ద్రవ్యరూప యజ్ఞాన్ని,వ్రతరూప తపోయజ్ఞాన్ని,ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని,వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి.
ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు.యజ్ఞశేషం అమృతంలాంటిది.యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు.
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి.అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే.
తత్వవేత్తలను వినయముతో సేవించి,ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నా వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు.మోహానికి గురికావు.
ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు.
కర్రలను అగ్ని వలె,కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు.
కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు.
శ్రద్దజ్ఞానాలు లేనివారు,సందేహాలు కల్గినవాడు,నమ్మకం లేని వాడు చెడిపోతారు.ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు.
పరమార్థ జ్ఞానంతో కర్మలను,బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకోన్నవాడిని కర్మలు బంధించవు.
కాబట్టి జ్ఞానం చే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు.లే.
Ghnana yogam in Telugu Bhagava Gita | జ్ఞానయోగము 4 వ అధ్యాయం
4.జ్ఞాన యోగము - చతుర్ధాధ్యాయము
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు.
లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను.
నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను.
రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు.
ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
No comments:
Post a Comment