Karma yogam in Telugu Bhagavad Gita కర్మ యోగము (3 వ అధ్యాయం) | Rayachoti360

Karma yogam in Telugu Bhagavad Gita కర్మ యోగము (3 వ అధ్యాయం) | Rayachoti360


Karma yogam in Telugu Bhagavad Gita కర్మ యోగము (3 వ అధ్యాయం) | Rayachoti360
 
కర్మయోగము(3 వ అధ్యాయం)


అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు.
అప్పుడు కృష్ణుడు "
Karma yogam in Telugu Bhagavad Gita కర్మ యోగము (3 వ అధ్యాయం) | Rayachoti360

ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగానూ, యోగులకు కర్మయోగంగానూ చెప్పాను. కర్మలు (పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు. 

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. ఇంద్రియనిగ్రహం కలిగి,ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు.

యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు.బ్రహ్మదేవుడు యజ్ఞాలవలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు.

యజ్ఞాల ప్రాముఖ్యత :

యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు.యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు.కర్మల వలన యజ్ఞాలు, యజ్ఞం వలన వర్షం,వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి.

పరమాత్మ వలన వేదాలు,వాటి వలన కర్మలు సంభవించాయి.ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి,ఆచరించని వారు పాపులు.

ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మలు లేవు.అతడు సర్వస్వతంత్రుడు ఐన కారణంగా కర్మలు చేయడంవలన అతనికి లాభం కానీ,చేయకపోవడంవలన అతనికి నష్టం కాని ఉండవు.నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి.జనకుడు మొదలగువారు కూడా నిష్కామకర్మలు చేసారు.
ఉత్తముల కర్మలను,ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు.

నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం,లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను.

ఓ అర్జునా అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్ట్లే ,జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి.జ్ఞాని పనిచేసేవారి బుధ్ధి చలింపచేయకుండా తను పని చేస్తూ వారి చేత కూడా పని చేయించాలి.అన్ని కర్మలూ ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు.కాని జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకారరహితంగా ఉంటాడు.

అలా ఆసక్తి కలిగినవారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచరాదు.

అన్ని కర్మలనూ నాకే సమర్పించి, కోరికలనూ,అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్దం చేయి. 

పైవిధంగా చేసినవారు సమస్తకర్మ దోషాల నుండి విముక్తులవుతారు.మిగిలినవారు భ్రష్ఠులు.

మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది?
రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు.అందువలన మరణించినా ఫర్వాలేదు.

కామం యొక్క ప్రభావం :
అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం

రజో గుణం నుండి పుట్టే కామ క్రోధాలే దీనికి కారణం. పొగ చే అగ్ని, మాయచే పిండము కప్పబడినట్లు కామం చే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి, వివేకాన్ని హరించి మనుషులను భ్రమింప చేస్తోంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు.

శరీరం కంటే ఇంద్రియాలు, వాటి కన్నా మనసు, మనసు కన్నా బుధ్ధి , బుధ్ధి కన్నా ఆతమ గొప్పది. 

ఆత్మ వీటన్నిటి కన్నా పైన ఉంటుంది.

కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.


How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.


Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com




3.కర్మ యోగము - తృతయాధ్యాయము

కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన

యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.

లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.

ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము. కర్మణ్యే వాధికారస్తే మాఫలే సుఖదాచనా, మా కర్మఫలాగే దుర్భు:మాతే సంగోస్త్వ కర్మణి||


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com



Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Post a Comment

0 Comments