3BHK Telugu Movie Review: A Reflective Journey Through Life's Struggles
నిన్న రాత్రి. నేనూ, నా భార్య అమెజాన్ ప్రైమ్‌లో '3BHK' సినిమా చూస్తున్నాం. 3BHK Telugu Movie Review తెర మీద కథానాయకుడు అద్దె ఇంటి కోసం యజమాని పెట్టే షరతులు వింటున్నాడు. "నీళ్ళు ఎక్కువ వాడకూడదు… చుట్టాలు ఒకటి రెండు రోజులకు మించి ఉండకూడదు. ఆసుపత్రిలో ఉన్నవాళ్లెవరూ ఇంటికి రాకూడదు..."
ఆ మాటలు వింటుండగా, నా భార్య నా వైపు చూసింది. ఆమె కళ్ళలో 40 ఏళ్ళ జీవితం కదలాడింది. మేమిద్దరం ఒక్కసారిగా నవ్వుకున్నాం, ఆ నవ్వు వెనుక అంతులేని దుఃఖం, మేము దాటుకొచ్చిన గాయాల తడి ఉంది. ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం మా గడిచిన రోజులను ఒక పాత ఆల్బమ్‌లా తిరగేసింది. 16 సంవత్సరాలు... 8 అద్దె ఇళ్లు. రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి... ఊర్లు మారినా, యజమానులు మారినా మా తలరాత మారలేదు. ఇంటి యజమానులకు సంజాయిషీలు ఇచ్చుకుంటూ, తెలిసో తెలియకో ఒకరకమైన ఆత్మన్యూనతా భావంలోకి నెట్టబడ్డాం. కనబడని ఏదో ఒత్తిడి మా స్వేచ్ఛ గొంతు నులిమేస్తున్నట్టు ఉండేది. గోడలకు చెవులుంటాయేమోనన్న భయంతో గుసగుసలాడుకున్న క్షణాలు, పిల్లలు గట్టిగా ఏడిస్తే యజమానికి ఏం సమాధానం చెప్పాలా అని కంగారుపడిన రాత్రులు... అన్నీ కళ్ళముందు కదిలాయి. ఈ కనబడని సంకెళ్ళ మధ్యే మా పిల్లలు పుట్టారు, పెరిగారు. వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ ఎదుగుదల మీద ఈ వాతావరణం ఎలాంటి ప్రభావం చూపిందో తలచుకుంటే ఎప్పటికీ గుండె తరుక్కుపోతుంది. మా పెద్దోడిని లాయర్‌ని చేయాలనుకున్నాం. కానీ వాడు తన ఇష్టప్రకారం ఇంగ్లీష్ లిటరేచర్, విజువల్ కమ్యూనికేషన్స్ చదివాడు. మా చిన్నోడికి మెకానికల్ ఇంజనీరింగ్ అనుకున్నాడు. కానీ, ఓ కాలేజీ యజమాని, బహుశా నిండని సీట్ల కోసం, వాడికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా MBAలో చేర్పించేశాడు. ఇష్టం లేని చదువుతో వాడు పడిన నరకం వాడి జీవిత గమనాన్నే మార్చేసింది. బహుశా మాకు ఒక సొంతిల్లు, ఒక భరోసా ఉండుంటే వాళ్ళ కలలకు మేము మరింత అండగా నిలబడగలిగేవాళ్ళమేమో! అప్పు చేయకుండా ఫ్లాటు కొనాలని నాలుగేళ్లు ఎదురుచూశాం. ప్రతి ఆదివారం నేనూ నా భార్య ఫ్లాట్ల కోసం తిరుగుతుంటే, " మీకు ఇంకా ఇల్లు సెట్ అవ్వలేదా?" అని దానవాయిపేట, ప్రకాశ్ నగర్ వీధుల్లో ఎంతోమంది అడిగేవారు. ఆ పలకరింపులో జాలి లేదా ఎగతాళి ఇబ్బంది పెట్టేవి . మేము కూడబెట్టిన డబ్బుకి, ఫ్లాటు రేటుకీ మధ్య ఎప్పుడూ ఓ యాభై, అరవై వేల తేడా ఉండేది. ఆ తేడా మా ఆశలకు, వాస్తవానికి మధ్య ఉన్న దూరమంత పెద్దదిగా తోచేది. సినిమా పూర్తయింది. మేమిద్దరం మౌనంగా ఉండిపోయాం. ఆ మౌనంలో 16 ఏళ్ల ఆవేదన, 40 ఏళ్ల ప్రయాణం ఉన్నాయి. నెమ్మదిగా తేలికపడ్డాం. ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చాం. చేతులు పట్టుకుని నవ్వుకున్నాము. పెద్ద ప్రయాణంలో ఒక మజిలీ వద్ద ప్రశాంతను, నిర్మలత్వాన్ని అనుభవించాము. ఇదే కదా జీవితం అని ఇద్దరం మౌనంగా, నిశ్శబ్దంగా అనుకున్నాము. ఇది కేవలం మా కథ కాదు. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్నీ ఎక్కడో ఒకచోట ఈ '3BHK' సినిమా గాఢంగా కౌగిలించుకుంటుంది. వాళ్ళ గాయాలను తడుముతుంది. వాళ్ళ పోరాటాన్ని గుర్తుచేస్తుంది. చివరగా, "మీరు ఒంటరి కాదు" అని భుజం తడుతుంది.
3BHK Telugu Movie Review: A Reflective Journey Through Life's Struggles
Review:
Last night, my wife and I were watching the movie '3BHK' on Amazon
Prime. As the protagonist listens to the conditions imposed by a landlord for
renting a house, we were reminded of the struggles we’ve faced in our own
lives.
“Water consumption should be minimal… No relatives should
stay longer than two days. No patients should visit…”
As these words echoed on the screen, my wife turned towards
me. In her eyes, I could see the reflection of 40 years of our shared life
together. And then, we both smiled — a smile that was laden with the weight of
countless unspoken sorrows, wounds that we had weathered together. Every scene
in that film felt like turning the pages of an old album, reminding us of the
paths we had traveled.
16 years… 8 rented homes. From Renigunta to Vijayawada,
and then to Rajahmundry. Although the places and landlords changed, the
fate of our journey never did. We were constantly pushing through, with
self-doubt creeping in, trying to balance the demands of landlords, their
unwarranted expectations, and the never-ending pressure of managing life. The
invisible chains held us back, as if they were suffocating our freedom. The
fear of “the walls have ears” haunted us. There were moments when we
whispered, worried that even the slightest sound would get us into trouble with
the landlord. We’ve had countless sleepless nights, worrying about what to say
when our children cried, fearing their innocent pain would anger the owner.
Amidst all these invisible chains, our children were born
and grew. The thought of how this environment impacted their growth and
thoughts still makes my heart ache.
We dreamt of making our eldest a lawyer, but he chose to study English Literature and Visual Communications. Our youngest was supposed to pursue Mechanical Engineering, but due to a college owner who prioritized filling seats over a student's choice, he was forced into an MBA program. The hell he went through with an education he didn’t want changed the course of his life forever.
Perhaps, if we had had our own home, a sense of security, we could’ve supported their dreams more strongly.
We waited for four years without making a move to buy a
flat. Every Sunday, my wife and I would look for flats, and people in Dhanavayipeta
and Prakash Nagar would ask, “Still haven’t found a house?” Those words
were always a mix of either pity or mockery. The difference between the amount
of money we had saved and the prices of flats always felt like a chasm. That
gap seemed as wide as the distance between our hopes and the harsh reality.
By the time the movie ended, we sat in silence. That silence
spoke volumes — 16 years of anguish, 40 years of life’s journey. Slowly, we let
out a deep sigh. We exchanged glances, shared a tearful smile, held hands, and
laughed. We had experienced a peaceful moment at a milestone in our long
journey, a moment of clarity. It was as if we were silently acknowledging — this
is life.
'3BHK' isn’t just our story; it’s the story of every
middle-class family out there. The movie embraces their wounds, reminds them of
their struggles, and in the end, tells them, "You are not alone."
10 th class after 10 va taragathi emi cheyali | Rayachoti360
The blog "rayachoti360.blogspot.com" offers a blend of regional news, local events, and community updates related to Rayachoti, while also featuring Friendship Stories and Kids Stories with moral lessons. The inclusion of these stories indicates that the blog has a family-friendly and lifestyle-oriented niche, focusing on promoting positive values such as friendship, morality, and life lessons, especially for young readers. It combines local cultural content with inspirational and educational storytelling, making it suitable for readers of all ages, particularly families and children. The blog appears to cater to a community-centric audience, blending news with engaging, moral-driven stories.
0 Comments