14 New Medical Colleges in Andhra Pradesh State
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రాబోతున్న 14 మెడికల్ కాలేజీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలను తీసుకుని రాబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వర్చువల్ విధానంలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు కూడా వస్తాయని అన్నారు. పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 500 పడకల ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నామని.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని అన్నారు. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 5 ఎకరాల భూమి ఉచితంగా కేటాయిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలను తీసుకొస్తున్నామన్నారు. 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెన్షన్ అందిస్తున్నామని.. కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చామని అన్నారు. రెండేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రూ.5,215 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రాబోతున్న 14 మెడికల్ కాలేజీలు!
Source : https://nationalisthub.com/14-new-medical-colleges-in-andhra-pradesh/
Best cm in india.
ReplyDelete